Rashmika Mandanna: నా గురించి రాసింది చదివి ఎప్పుడూ ఇంత ఎమోషనల్ కాలేదు.. స్వేచ్ఛనిచ్చే ప్రేమను పొందండి: రష్మిక పోస్ట్
Rashmika Mandanna: రష్మిక మందన్న తాజాగా చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. విజయ్ తో తన పెళ్లి, అందులో తన సంతోషాన్నిచూసి తన గురించి రాసిన ఓ ఆర్టికల్ పై రష్మిక ఎమోషనల్ అయింది. అంతేకాదు మీకు స్వేచ్ఛనిచ్చే ప్రేమను పొందండి అని కూడా సూచించింది.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వాళ్ల గురించే ఎక్కువగా చర్చ నడుస్తోంది. తాజాగా రష్మిక ఎక్స్ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. తన గురించి ఎవరో రాసిన ఒక ఆర్టికల్ చదివి తను ఎంతలా భావోద్వేగానికి గురైందో వివరిస్తూ, తన మనసులోని మాటలను అభిమానులతో పంచుకుంది. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

రష్మిక ట్వీట్‌లో ఏముందంటే..
చాలా కాలం తర్వాత తన గురించి రాసిన ఒక విషయం చదివి తను ఇంతలా ఎమోషనల్ అవ్వడం బహుశా ఇదే తొలిసారి అని రష్మిక మందన్న రాసుకొచ్చింది.
"చెప్పాలని నా మనసులో చాలా ఉంది.. కానీ నేను బయటపెట్టగలిగేది చాలా తక్కువే. నేను నాకంటూ ఒక సొంత స్పేస్ వెతుక్కుంటున్నాను.. నేను చేస్తున్న ఈ ప్రయాణం పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను. నా ఈ జర్నీని గుర్తించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు" అని చెప్పింది.
స్వేచ్ఛను ఇచ్చే ప్రేమే నిజమైన ప్రేమ
ఈ పోస్ట్‌లో అందరినీ అత్యంత ఆకర్షించిన లైన్ ఒకటుంది. "ప్రేమ గురించి నేను చెప్పగలిగేది ఒకటే - మిమ్మల్ని స్వేచ్ఛగా ఉంచే ప్రేమను వెతుక్కోండి" అని రష్మిక ఒక అద్భుతమైన సందేశం ఇచ్చింది. విజయ్ దేవరకొండ తనను ఎంత స్వేచ్ఛగా ఉంచుతాడో, తన కలలను సాధించడంలో అతడు ఇచ్చే ప్రోత్సాహం ఎలాంటిదో ఈ ఒక్క మాటతో రష్మిక చాలా స్పష్టంగా చెప్పేసింది.
వెడ్డింగ్ పోస్ట్‌లోనూ ఇలాగే..
రీసెంట్‌గా ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరిగిన లగ్జరీ వెడ్డింగ్‌లో విజయ్‌ను పెళ్లాడిన రష్మిక.. తన భర్త గురించి చేసిన మొదటి పోస్ట్‌లో కూడా ఇలాంటి మాటలే చెప్పింది. "నేను పెద్ద పెద్ద కలలు కనడం తప్పు కాదని చెప్పిన వ్యక్తి, నన్ను ఎవరూ చూడటం లేనట్లుగా స్వేచ్ఛగా డ్యాన్స్ చేయకుండా ఎప్పుడూ ఆపని వ్యక్తి" అంటూ అప్పట్లో విజయ్‌ను పొగడ్తలతో ముంచెత్తింది.
ఇప్పుడు ఈ తాజా పోస్ట్ చూస్తుంటే, విజయ్ ప్రేమలో తను ఎంతలా స్వేచ్ఛగా ఫీల్ అవుతుందో మనకు ఇట్టే అర్థమవుతుంది. ప్రతి అమ్మాయి కూడా తనను బంధించే ప్రేమను కాకుండా, తనను తనలా ఉండనిచ్చే ప్రేమను ఎంచుకోవాలని రష్మిక పరోక్షంగా ఒక మంచి సలహా ఇచ్చింది.
రష్మిక కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. ఎన్నో విమర్శలను దాటుకుని పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదిగింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో విజయ్ తనకు ఎంతో అండగా నిలబడ్డాడు. అందుకే తనను అర్థం చేసుకునే వాళ్లు తన గురించి రాసినప్పుడు రష్మిక ఇంతలా కనెక్ట్ అయింది. అభిమానులు కూడా ఆమె పోస్ట్‌కు స్పందిస్తూ, "రష్మిక.. నువ్వు నిజంగా ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్" అంటూ ప్రేమగా వ్యాఖ్యానిస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


