Jr NTR Wishes CBN : 'మావయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు' - సీఎం చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మేనల్లుడు, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా విషెస్ చెప్పాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు మావయ్య గారు అంటూ రాసుకొచ్చాడు.
Chandrababu Naidu Birthday : ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జన్మదినం. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ నాయకులు, ప్రముఖులు, అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆత్మీయంగా పోస్ట్ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు…
"గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మావయ్య గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు" అని ఎన్టీఆర్ తన సందేశాన్ని ప్రారంభించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. “ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని పొందాలని కోరుకుంటున్నాను. మీ నాయకత్వం రాష్ట్రానికి పురోగతిని, శ్రేయస్సును, గర్వాన్ని అందిస్తూ కొనసాగాలని ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.
ఇక సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. “ప్రియమైన శ్రీవారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి పుట్టుకకు ఒక కారణం ఉందంటారు. చంద్రబాబుగారు పుట్టింది తెలుగు ప్రజల కోసం. పుట్టిన రోజు వేడుకలలో ఆనందం కన్నా ప్రజల సేవలోనే ఆయనకు ఎక్కువ ఆనందం. అంత ఇష్టమైన ప్రజల కోసం నిండు నూరేళ్లూ పూర్తి ఉత్సాహంతో, సంపూర్ణ శక్తితో, ఆరోగ్యంతో చంద్రబాబుగారు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను” అని శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు.
“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలి” అని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ శ్రేణులు చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను పండుగలా నిర్వహిస్తున్నాయి. పలుచోట్ల సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనూ ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించనున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

