Jr NTR: బాడీ బాక్సాఫీస్.. నెట్టింట సెగలు పుట్టిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫొటో.. కండలు తిరిగిన దేహంతో తారక్

Jr NTR: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ తన బాడీని పూర్తిగా మార్చుకుంటున్నాడు. ఇందుకోసం జిమ్ లో కష్టపడుతున్నాడు. కండలు తిరిగి దేహంతో ఉన్న ఫొటోను తారక్ తాజాగా ఇన్ స్టాలో పోస్టు చేశాడు. ఈ పిక్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 

Published on: Apr 13, 2026, 09:11:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jr NTR: కండలు తిరిగిన దేహంతో, అదిరిపోయే బాడీ స్ట్రక్చర్ తో, అదుర్స్ అనిపించే మజిల్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ మూవీ కోసం తారక్ తన బాడీని ఛేంజ్ చేసుకుంటున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫొటో (instagram-jrntr)
జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫొటో (instagram-jrntr)

ఎన్టీఆర్ ఫొటో

సోమవారం (ఏప్రిల్ 13) జూనియర్ ఎన్టీఆర్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటో తెగ వైరల్ గా మారింది. ఇది ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. వెనకాలకు తిరిగి తన కండలను చూపిస్తున్న తారక్ పిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘‘ఇది నిర్మించింది. కొన్నది కాదు’’ అనే క్యాప్షన్ తో ఎన్టీఆర్ పోస్టు చేసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాను తగలబెట్టేస్తోంది.

బాడీ బాక్సాఫీస్

జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫొటో ఇన్ స్టాగ్రామ్ లో ప్రత్యక్షం కాగానే ఫ్యాన్స్ షేర్ చేస్తూ, కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. బాడీ బాక్సాఫీస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సునామీ లోడింగ్ అని పోస్టులు పెడుతున్నారు. ఫైర్ ఎమోజీలు పోస్టు చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్ మూవీ కోసం

ప్రస్తుతం ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా తన లుక్ ఛేంజ్ చేశాడు. బరువు తగ్గి, సన్నగా మారిపోయాడు. గుబురు గడ్డంతో స్టైలిష్ గానూ కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇలా కండలు తిరిగిన దేహంతో కనిపించి సర్ ప్రైజ్ చేశాడు.

షూటింగ్ ఆగిపోయిందా?

ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ చిత్రం డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీ షూటింగ్ ఆగిపోయిందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఆర్టిస్ట్ ల లుక్ సెట్ కాలేదని, అందుకే మళ్లీ రీషూట్ చేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. కానీ దీనిపై ఇప్పటివరకూ మూవీ టీమ్ అఫీషియల్ గా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇప్పుడేమో తారక్ ఇలా మజిల్ బాడీని పోస్టు చేశాడు.

వార్ 2

జూనియర్ ఎన్టీఆర్ చివరగా వార్ 2 సినిమాలో కనిపించాడు. ఈ మూవీతోనే తారక్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలిచింది. హృతిక్ రోష‌న్‌, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ మల్టీ స్టారర్ సినిమాలో కియారా అద్వాణీ హీరోయిన్ గా కనిపించింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More