Jr NTR: బెంగళూరులో జూనియర్ ఎన్టీఆర్ మాస్ క్రేజ్.. ఎగబడ్డ ఫ్యాన్స్.. రోడ్లన్నీ ఫుల్.. వీడియోలు వైరల్.. తారక్ జాగ్రత్తలు
Jr NTR: బెంగళూరు రోడ్లన్నీ ఫుల్.. ఎక్కడ చూసినా ఫ్యాన్స్ జన సందోహమే. జూనియర్ ఎన్టీఆర్ ను చూసేందుకు ఎగబడ్డ అభిమాన సంద్రం ఇది. ఓ ఈవెంట్ కోసం బెంగళూరుకు వెళ్లిన తారక్ ను ఫ్యాన్స్ చుట్టుముట్టారు. ఈ వీడియోలు తెగ వైరల్ గా మారాయి.
అది తెలంగాణ కాదు, ఆంధ్ర కూడా కాదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడని తెలియగానే రోడ్లన్నీ ఫుల్ అయిపోయాయి. స్ట్రీట్స్ అన్ని కిక్కిరిసిపోయాయి. ఎయిర్ పోర్ట్ నుంచి కిమ్స్ హాస్పిటల్ వరకూ బెంగళూరు మొత్తం ఎన్టీఆర్ నామస్మరణతో మార్మోగింది. ఆదివారం (మార్చి 8) బెంగళూరులోని సీన్స్ ఎన్టీఆర్ మాస్ క్రేజ్ ను చాటాయి.

బెంగళూరులో తారక్
బెంగళూరులో కిమ్స్ హాస్పిటల్ బ్రాంచ్ ఓపెనింగ్ కు చీఫ్ గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వెళ్లాడు. తారక్ వస్తున్నాడని తెలుసుకున్న తెలుగు, కన్నడ ఫ్యాన్స్ ఎగబడ్డారు. రోడ్లన్నీ అభిమానులతో నిండిపోయాయి. దీంతో మహాదేవపుర, ఎలక్ట్రానికి సిటీ వైపు వెళ్లే రోడ్లు బ్లాక్ అయ్యాయి. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
సీఎం సీఎం
తారక్ కోసం రోడ్డుకు రెండు వైపులా ఫ్యాన్స్ వెయిట్ చేశారు. కారు సన్ రూఫ్ నుంచి తారక్ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశాడు. దీంతో అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోయింది. సీఎం, సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేయడం గమనార్హం. పోటెత్తిన అభిమాన సంద్రాన్ని నిలువరించడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది.
వీడియోలు వైరల్
హాస్పిటల్లో కూడా ఎన్టీఆర్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఓ దశలో తోసుకుంటూ వచ్చారు. దీంతో పరిస్థితి అదుపు తప్పేలా కనిపించింది. కానీ ఎన్టీఆర్ ప్రైవేట్ సెక్యూరిటీ, హాస్పిటల్ సెక్యూరిటీ, పోలీసులు కలిసి తారక్ కు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
జాగ్రత్తగా
కిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్ తర్వాత తారక్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడాడు. ‘‘మా ఇంట్లో జరిగిన దుర్ఘటనలు మీ ఇంట్లో జరగొద్దు. జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లండి’’ అని అభిమానులకు తారక్ మరోసారి స్పష్టంగా తెలిపాడు. వేర్వేరు రోడ్డు యాక్సిడెంట్ల కారణంగా జూనియర్ ఎన్టీఆర్ తండ్రి, అన్న మరణించిన సంగతి తెలిసిందే.
డ్రాగన్ లుక్
ఎన్టీఆర్ ప్రస్తుతం కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి డ్రాగన్ అనే పేరు ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో తారక్ లుక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం తారక్ ను చూసిన ఫ్యాన్స్ లుక్ అదిరిపోయిందని అంటున్నారు.
నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తారక్ చివరిగా వార్ 2 సినిమాలో కనిపించాడు. ఈ మూవీతోనే బాలీవుడ్ లో డెబ్యూ చేశాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


