Naga chaitanya-Sobhita: పూరీ జగన్నాథుని సేవలో నాగ చైతన్య, శోభిత.. జై జగన్నాథ్ అంటూ చై.. కపుల్ వీడియో వైరల్
Naga chaitanya-Sobhita: టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో ఒకరైన నాగ చైతన్య, శోభితా ధూళిపాళ మరోసారి వార్తల్లో నిలిచారు. పూరీ జగన్నాథుని సేవలో వీళ్లు తరించారు. పూరీ జగన్నాథుని దర్శనం కోసం వెళ్లిన వీళ్ల వీడియో వైరల్ గా మారిది.
నాగ చైతన్య, శోభితా ధూళిపాళ.. టాలీవుడ్ లోని మోస్ట్ పాపులర్ జోడీల్లో వీళ్లది ఒకటి. తమ పెళ్లి అయినప్పటి నుంచి నాగ చైతన్య, శోభితా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఈ జోడీ పూరీ జగన్నాథుని సేవలో తరించారు. నాగ చైతన్య, శోభితా పూరీ జగన్నాథ్ టెంపుల్ కు వెళ్లారు.

నాగ చైతన్య, శోభితా
అక్కినేని ఫ్యామిలీ నట వారసుడు నాగ చైతన్య, అతని భార్య శోభితా ధూళిపాళ తాజాగా పూరీ జగన్నాథుడిని దర్శించుకున్నారు. ఒడిషాలోని పూరీలో ఉన్న గుడికి వెళ్లారు. ఈ జంట కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆలయానికి చేరుకుని, గర్భగుడిలో కొంత సమయం గడిపింది. గుడిలోకి వీళ్లు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జై జగన్నాథ్
ANI న్యూస్ ప్లాట్ ఫామ్ తన ఎక్స్ అకౌంట్లో పంచుకున్న వీడియోలో నాగ చైతన్య సంప్రదాయ ధోవతితో పాటు తెల్ల చొక్కా ధరించి కనిపించాడు. శోభితా ఎర్ర చీరలో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఆలయ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ మాట్లాడారు. అప్పుడు చైతన్య 'జై జగన్నాథ్' అని అన్నాడు. దీంతో అక్కడున్న భక్తులు, అభిమానులు హర్షధ్వానాలు చేశారు.
చైతన్య, శోభితా పెళ్లి
నాగ చైతన్య, శోభితా ధూళిపాళ డిసెంబర్ 5, 2024న పెళ్లి చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో వీళ్ల వెడ్డింగ్ జరిగింది. 2025 డిసెంబర్ 5కు వీళ్ల ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కంప్లీట్ అయింది. అంతకుముందు హీరోయిన్ సమంత రూత్ ప్రభును నాగ చైతన్య వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఈ జంట విడాకులు తీసుకుంది.
సినిమాలు
నాగ చైతన్య ప్రస్తుతం హారర్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'వృషకర్మ'లో నటిస్తున్నాడు. కార్తీక్ దండు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి రీసెంట్ గా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం హారర్, పురాణాలు, సాహసం, యాక్షన్ వంటి అంశాలతో రెడీ అవుతోందని తెలిసింది. బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్.
మరోవైపు వివిధ ప్రాజెక్ట్ లతో శోభితా ధూళిపాళ బిజీగా ఉంది. జనవరి, 2026లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘చీకటిలో’ శోభితా లీడ్ రోల్ ప్లే చేసింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


