24x7 కనిపించాల్సిన అవసరం లేదు.. పీఆర్ కల్చర్, పబ్లిసిటీ పిచ్చిపై శోభితా ధూళిపాళ స్ట్రెయిట్ కౌంటర్!

సినిమా రంగంలో విపరీతమైన పీఆర్ కల్చర్ పై శోభితా ధూళిపాళ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను 24 గంటల పాటు బయట కనిపించాలని కోరుకోనని, తన గురించి తనకు మాత్రమే బాగా తెలుసని ఈ అక్కినేని కోడలు పేర్కొంది. 

Published on: Feb 16, 2026, 13:47:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అక్కినేని కోడలు శోభితా ధూళిపాళ ఇటీవల ఓటీటీలో రిలీజైన ‘చీకటిలో’ అనే సైకో క్రైమ్ థ్రిల్లర్ తో మళ్లీ తెలుగులోకి తిరిగొచ్చింది. వివిధ భాషల సినిమాల్లో నటించిన ఆమె సినిమా రంగంలో పీఆర్ కల్చర్, పబ్లిసిటీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

శోభితా ధూళిపాళ (Photo: Instagram)
శోభితా ధూళిపాళ (Photo: Instagram)

శోభితా సెలక్షన్

శోభితా ధూళిపాళ తన కెరీర్ లో వివిధ భాషల్లోని సినిమాల్లో నటించారు. ఇటీవల 'చీకటిలో' ఓటీటీ మూవీతో ఆమె తెలుగు సినిమాకు తిరిగి వచ్చారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో తన సినిమాల సెలక్షన్ పై శోభితా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా చీకటిలో సినిమా కోసం సైన్ చేసేముందు ఆమె ఏ విషయాలను ఆలోచించిందోనని చెప్పుకొచ్చింది.

చాలా డీప్ గా

"నేను ఈ (చీకటిలో) ప్రాజెక్టుకు ఓకే చెప్పినప్పుడు అంత డీప్ గా ఆలోచించలేదు. ఒక ఆడియన్ గా తెలుగు సినిమాతో నాకు చాలా అనుబంధం ఉంది. ఒక ఆర్టిస్ట్ గానూ ఉంది. నేను యాక్టింగ్ ప్రారంభించినప్పుడు తెలుగు అమ్మాయిని అనే అనుభవం సహజంగానే ఉపయోగపడింది.

ఈ (చీకటిలో) సినిమాలో నేను ఒక పాడ్‌కాస్టర్ పాత్ర పోషించాను కాబట్టి చాలా స్పష్టమైన పదాలు వాడాల్సి వచ్చింది. నా భాషను మాట్లాడటం చాలా సంతోషంగా అనిపించింది. ఇది నా మాతృభాష. ఈ రకమైన సంభాషణలను పలకడం భాష తెలియకపోతే సులువు కాదు’’ అని శోభితా తెలిపింది.

పీఆర్ కల్చర్

సినిమా రంగంలో పీఆర్ కల్చర్ పెరిగిపోతుందనే దానిపై శోభితా ధూళిపాళ సంచలన వ్యాఖ్యలు చేసింది. "గత కొన్నేళ్లుగా అప్పుడప్పుడూ నా కోసం ఓ పీఆర్ సంస్థను అసైన్ చేసుకున్నా. కానీ నా వ్యక్తిత్వానికి, నేను తీసుకోవాలనుకునే నిర్ణయాలకు, నా జీవితానికి ఇది అవసరం లేదని అనిపించింది. నేను 24x7 బయట కనిపించాలని అనుకోవడం లేదు. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలని కూడా అనుకోను. నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు’’ అని శోభితా చెప్పింది.

నా గురించి

"నేను పీఆర్ టీమ్ తో పని చేయను. నాకు అది అవసరం లేదు. కానీ బహుశా అది వేరేవాళ్లకు అవసరమేమో. ఇందులో ఎలాంటి రూల్స్ లేవు. ఎందుకంటే ఎవరి ప్రయారిటీస్ వాళ్లకు ఉంటాయి. నా గురించి నాకు తెలుసు. నా సొంత ప్రాధాన్యతల గురించి నాకు తెలుసు’’ అని శోభితా వివరించింది.

‘‘నేను సినిమా ప్రపంచం నుంచి లేదా ముంబై నుంచి రాలేదు. నాది విశాఖపట్నం. అక్కడి నుంచే నేను నేర్చుకున్నా. నాకు ఏం కావాలో, ఏం వద్దో అనే క్లారిటీ ఉంది. నాకు నా గురించి మాత్రం తెలుసు’’ అని శోభితా పేర్కొంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More