ఇతర స్టార్ కిడ్స్‌పై నెగెటివ్ పీఆర్- సెన్సేషనల్ సాంగ్‌తో మొదలు- కూతురు రాషా తడానీపై ఆరోపణలు- నటి రవీనా టాండన్ రియాక్షన్

తన కూతురు రాషా తడానీ ఇమేజ్ పెంచడం కోసం ఇతర స్టార్ కిడ్స్‌ను కించపరిచేలా పీఆర్ టీమ్స్ పనిచేస్తున్నాయన్న ఆరోపణలను సీనియర్ హీరోయిన్, కేజీఎఫ్ 2 నటి రవీనా టాండన్ కొట్టిపారేశారు. ఈ విష ప్రచారంలో నిజం లేదని, ఇలాంటి పనులు చేయడం తమ సంస్కృతి కాదని ఆమె స్పష్టం చేశారు.

Published on: Feb 16, 2026, 11:38:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా స్టార్ కిడ్స్ హవా నడుస్తోంది. గతేడాది ‘ఉయి అమ్మ’ అనే సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే, ఈ పాటలో స్టార్ కిడ్ రాషా తడానీ నటించినప్పటికీ ఆమె డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ఇతర స్టార్ కిడ్స్ కంటే రాషా చాలా బెటర్ అని తెగ కామెంట్స్ వచ్చాయి.

ఇతర స్టార్ కిడ్స్‌పై నెగెటివ్ పీఆర్- సెన్సేషనల్ సాంగ్‌తో మొదలు- కూతురు రాషా తడానీపై ఆరోపణలు- నటి రవీనా టాండన్ రియాక్షన్
ఇతర స్టార్ కిడ్స్‌పై నెగెటివ్ పీఆర్- సెన్సేషనల్ సాంగ్‌తో మొదలు- కూతురు రాషా తడానీపై ఆరోపణలు- నటి రవీనా టాండన్ రియాక్షన్

రాషా తడానీపై రూమర్స్

అలా ఉయి అమ్మ సాంగ్ విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత సీనియర్ హీరోయిన్, కేజీఎఫ్ 2 నటి రవీనా టాండన్ కూతురు అయిన రాషా తడానీపై కొన్ని రూమర్స్ మొదలయ్యాయి.

స్టార్ కిడ్స్‌పై నెగెటివ్ పీఆర్

తన సొంత ఇమేజ్‌ని పెంచుకోవడానికి ఇతర స్టార్ కిడ్స్‌పై రాషా తడానీ నెగెటివ్ పీఆర్ (Negative PR) చేయిస్తోందని నెట్టింట కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ రూమర్లపై రవీనా టాండన్ తాజాగా స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.

మా కుటుంబానికి అలాంటి అవసరం లేదు

ఒక పాపులర్ పాడ్‌కాస్ట్ సెషన్‌లో పాల్గొన్న రవీనా టాండన్ తన కూతురిపై వస్తున్న ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు. "నా సుదీర్ఘ కెరీర్‌లో నేను ఎప్పుడూ ఒక పీఆర్ వ్యక్తిని పెట్టుకోలేదు. అలాంటిది మా స్నేహితుల పిల్లల గురించి, మా కళ్ల ముందే పెరిగిన పిల్లల గురించి తప్పుగా ప్రచారం చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇది మా కుటుంబ సంస్కృతే కాదు" అని రవీనా టాండన్ తన ఆవేదన వ్యక్తం చేశారు.

విషపూరితమైన ఫ్యాన్ వార్స్

ఈ వివాదం ‘ఉయి అమ్మ’ సాంగ్ విడుదల తర్వాత మొదలైందని రవీనా గుర్తు చేశారు. కొందరు ఫ్యాన్స్ రాషాను ప్రశంసిస్తూనే ఇతర స్టార్ కిడ్స్‌తో పోలికలు పెట్టడం, అది కాస్తా విషపూరితమైన ఫ్యాన్ వార్స్ (Fan Wars)కి దారితీయడం దురదృష్టకరమని రవీనా టాండన్ పేర్కొన్నారు. ఎవరో ఒకరిని తక్కువ చేసి చూపిస్తేనే మనం గొప్పవాళ్లం అవుతామనే నీచమైన ఆలోచన ఎవరికీ ఉండదని ఆమె నొక్కి చెప్పారు.

రాషా సినీ ప్రయాణం

ఇకపోతే అభిషేక్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆజాద్’ సినిమాతో రాషా తడానీ హిందీ చిత్ర పరిశ్రమలో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, రాషా డ్యాన్స్, నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం రాషా చేతిలో ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి.

లైకీ లైకా (Laikey Laikaa): అభయ్ వర్మతో కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇందులో రాషా తడానీ ‘ఛాప్ తిలక్’ అనే పాటతో సింగర్‌గా కూడా పరిచయం కాబోతోంది.

టాలీవుడ్ ఎంట్రీ: ఇటీవల రాషా తడానీ తన తెలుగు అరంగేట్రం గురించి కూడా ప్రకటన చేసింది. మెగా హీరోలతో ఆమె నటించబోతుందనే వార్తలు టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More