ధురంధర్‌కు ఊహకందని లాభాలు.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 కంటే ఎక్కువ.. బాహుబలి 2, పుష్ప 2 తర్వాత ఇదే

రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లు వసూలు చేయడమే కాదు, లాభాల్లోనూ సరికొత్త చరిత్ర సృష్టించింది. 'ఆర్ఆర్ఆర్', ‘కేజీఎఫ్-2’వంటి సినిమాలను వెనక్కి నెట్టి.. ఏకంగా రూ. 400 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది.

Published on: Feb 5, 2026, 14:25:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందీ సినిమా హిస్టరీలోనే 'ధురంధర్' ఒక సంచలనంగా మారింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ స్పై థ్రిల్లర్.. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, లాభాల విషయంలోనూ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. పాన్ ఇండియా హిట్లయిన 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' లాంటి సినిమాలను కూడా లాభాల రేసులో 'ధురంధర్' దాటేయడం ఇప్పుడు హాట్ టాపిక్.

ధురంధర్‌కు ఊహకందని లాభాలు.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 కంటే ఎక్కువ.. బాహుబలి 2, పుష్ప 2 తర్వాత ఇదే
ధురంధర్‌కు ఊహకందని లాభాలు.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 కంటే ఎక్కువ.. బాహుబలి 2, పుష్ప 2 తర్వాత ఇదే

రెండు ముక్కలు.. రెట్టింపు లాభాలు

వాస్తవానికి 'ధురంధర్' ఒకే సినిమాగా విడుదల కావాల్సి ఉంది. కానీ సినిమా నిడివి 6 గంటలు దాటడంతో, ఎడిటింగ్ టేబుల్ దగ్గర దర్శకుడు ఆదిత్య ధర్, నిర్మాతలు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అదే సినిమాను రెండు భాగాలుగా విడగొట్టడం. విడుదలకి కొన్ని వారాల ముందు తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

మొదటి భాగం క్లిక్ అయితేనే రెండో భాగం అమ్ముడుపోతుందన్న రిస్క్ ఉన్నప్పటికీ, కంటెంట్ బలంగా ఉండటంతో ఆ ప్లాన్ సూపర్ హిట్ అయ్యింది. ఒక సినిమా బడ్జెట్‌ను రెండు సినిమాలకు పంచడం వల్ల మొదటి భాగం నుంచే భారీ లాభాలు వచ్చాయి.

లాభాల లెక్కలు ఇలా..

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 'ధురంధర్' సక్సెస్ స్టోరీ ఇలా ఉంది.

ఇండియా గ్రాస్: రూ. 1004 కోట్లు (దీనిలో నిర్మాతల షేర్ సుమారు రూ. 360 కోట్లు).

ఓవర్సీస్: 33 మిలియన్ డాలర్లు (నిర్మాతల షేర్ సుమారు 15 మిలియన్ డాలర్లు).

నాన్-థియేట్రికల్: డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ద్వారా పింక్‌విల్లా రిపోర్ట్ ప్రకారం రూ. 140 కోట్లు వచ్చాయి.

మొత్తం రికవరీ: సుమారు రూ. 650 కోట్లు.

ఇక మొత్తం ఖర్చు విషయానికి వస్తే సినిమా బడ్జెట్ రూ. 400 కోట్లు కాగా, దాన్ని రెండు భాగాలుగా విభజించారు. మార్కెటింగ్ ఖర్చులతో కలిపి పార్ట్-1 ఖర్చు సుమారు రూ. 250 కోట్లుగా తేలింది. ఆ లెక్కన ఖర్చులు పోను నిర్మాతలకు మిగిలింది అక్షరాలా రూ. 400 కోట్లు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇది అత్యధిక లాభాల్లో ఒకటి.

దిగ్గజ సినిమాలన్నీ వెనకే..

రూ. 400 కోట్ల లాభం అనేది సామాన్య విషయం కాదు. ఇటీవల వచ్చిన భారీ చిత్రాల లాభాలతో పోలిస్తే 'ధురంధర్' చాలా ముందుంది. షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ అతని క్రేజ్ వల్ల డిజిటల్ రైట్స్ భారీగా అమ్ముడవడంతో రూ. 400 కోట్లకు పైగా లాభంతో 'ధురంధర్' కంటే ముందున్న ఏకైక బాలీవుడ్ సినిమాగా నిలిచింది.

అయితే పఠాన్ (రూ. 330 కోట్లు), యానిమల్ (రూ. 250 కోట్లు) ధురంధర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రాజమౌళి 'ఆర్ఆర్ఆర్', యష్ 'కేజీఎఫ్ 2' చిత్రాలు భారీ వసూళ్లు సాధించినా, వాటి లాభాలు రూ. 250 కోట్ల వద్దే ఆగిపోయాయి. ప్రభాస్ 'కల్కి 2898 AD' లాభం కూడా రూ. 150 కోట్లుగా అంచనా.

ఆర్ఆర్ఆర్, కల్కి వంటి సినిమాల బడ్జెట్లు (రూ. 550 కోట్లు+) విపరీతంగా ఉండటంతో, వసూళ్లు భారీగా ఉన్నా నికర లాభం తగ్గింది. కేజీఎఫ్ 2కి నాన్-థియేట్రికల్ ఆదాయం తక్కువగా ఉండటం మైనస్ అయ్యింది.

అయితే భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక లాభాలు ఆర్జించిన చిత్రాలుగా మాత్రం 'బాహుబలి 2', 'పుష్ప 2' (రూ. 600 కోట్లకు పైగా లాభాలతో) అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.

పాకిస్థాన్ నేపథ్యంలో సాగే ఈ స్పై థ్రిల్లర్‌లో అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు. దీని సీక్వెల్ 'ధురంధర్: ది రివెంజ్' మార్చి 19న థియేటర్లలోకి రానుంది.

టాప్‌లో ఉన్న ఇండియన్ సినిమాల లాభాలు (ట్రేడ్ అంచనాలు)
సినిమామొత్తం ఖర్చురికవరీలాభం
బాహుబలి 2 300 కోట్లు 950 కోట్లు 650 కోట్లు
పుష్ప 2 500 కోట్లు 1100 కోట్లు 600 కోట్లు
జవాన్ 350 కోట్లు 780 కోట్లు 430 కోట్లు
ధురంధర్ 250 కోట్లు 650 కోట్లు 400 కోట్లు
కేజీఎఫ్ ఛాప్టర్ 2 250 కోట్లు 600 కోట్లు 350 కోట్లు
పఠాన్ 270 కోట్లు 600 కోట్లు 330 కోట్లు
ఆర్ఆర్ఆర్ 550 కోట్లు 800 కోట్లు 250 కోట్లు
యానిమల్ 200 కోట్లు 450 కోట్లు 250 కోట్లు
కల్కి 2898 ఏడీ 600 కోట్లు 750 కోట్లు 150 కోట్లు
  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More