Vrushakarma glimpse: భయపెడుతున్న నాగ చైతన్య మిస్టికల్ థ్రిల్లర్ వృషకర్మ గ్లింప్స్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వీడియో

'విరూపాక్ష' దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న తాజా మిస్టిక్ థ్రిల్లర్ 'వృషకర్మ' (Vrushakarma) గ్లింప్స్ గురువారం (మార్చి 5) విడుదలైంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ మూవీలో 'లాపతా లేడీస్' ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ అత్యంత శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపిస్తుండటం విశేషం.

Mar 5, 2026, 14:41:52 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ యువసామ్రాట్ నాగచైతన్య, బ్లాక్ బస్టర్ 'విరూపాక్ష' డైరెక్టర్ కార్తీక్ దండు కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ మూవీ 'వృషకర్మ'పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. తాజాగా విడుదలైన 2 నిమిషాల గ్లింప్స్ వీడియో, సినిమాలోని గూస్ బంప్స్ తెప్పించే ఎలిమెంట్స్‌ను పరిచయం చేసింది. దైవ శక్తికి, క్షుద్ర శక్తికి మధ్య జరిగే పోరాటంగా ఈ సినిమా ఉండబోతోందని స్పష్టమవుతోంది.

Vrushakarma glimpse: భయపెడుతున్న నాగ చైతన్య మిస్టికల్ థ్రిల్లర్ వృషకర్మ గ్లింప్స్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వీడియో
Vrushakarma glimpse: భయపెడుతున్న నాగ చైతన్య మిస్టికల్ థ్రిల్లర్ వృషకర్మ గ్లింప్స్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వీడియో

వృషకర్మ గ్లింప్స్ విశేషాలు

నాగ చైతన్య లీడ్ రోల్ పోషిస్తున్న వృషకర్మ మూవీ గ్లింప్స్ ప్రారంభంలో స్పర్ష్ శ్రీవాస్తవ పాత్రను అత్యంత భీతిగొల్పేలా చూపించారు. క్షుద్ర మాంత్రిక విద్యలతో ఇంట్లోనే ఉంటూ ఒక వ్యక్తిని చంపే సీన్, అతని శరీరంలో కలిగే మార్పులు ప్రేక్షకులను వణికించేలా ఉన్నాయి.

"ప్రకృతికి విరుద్ధమైన శక్తులు మేల్కొన్నప్పుడు.. వాటిని అడ్డుకోవడానికి విధి ఒక 'వృషకర్మ'ను ఎంచుకుంటుంది" అనే వాయిస్‌ఓవర్ సినిమా నేపథ్యాన్ని వివరించింది. అపారమైన శక్తులు గల విలన్‌ను ఎదుర్కొనే ధీశాలిగా నాగచైతన్య 'మాస్ అవతార్'లో ఎంట్రీ ఇచ్చాడు.

అదరగొట్టిన స్పర్ష్ శ్రీవాస్తవ

ఈ గ్లింప్స్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం స్పర్ష్ శ్రీవాస్తవ కాస్టింగ్. 'లాపతా లేడీస్'లో అమాయకమైన యువకుడిగా కనిపించిన స్పర్ష్.. ఇందులో ఒక భయంకరమైన విలన్‌గా మారిపోయాడు. సోషల్ మీడియాలో నెటిజన్లు అతని నటనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

"స్పర్శ్ కాస్టింగ్ పర్‌ఫెక్ట్.. అతడు అందరినీ డామినేట్ చేసేలా ఉన్నాడు" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్య కూడా చాలా కాలం తర్వాత ఒక పవర్‌ఫుల్ అటెంప్ట్ చేస్తున్నారని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

వృషకర్మ సినిమా విశేషాలు

గతంలో నాగ చైతన్య ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. "ఇది ప్రాచీన భవిష్యవాణుల చుట్టూ తిరిగే కథ. ఇందులో నేను అర్జున్ అనే ట్రెజర్ హంటర్ (నిధి అన్వేషకుడు) పాత్రలో కనిపిస్తాను. మన పురాణాలకు, ఆధునిక కాలానికి ముడిపెడుతూ సాగే ఒక అద్భుతమైన విజువల్ స్పెక్టకిల్ ఇది" అని తెలిపాడు.

ఎస్‌వీసీసీ (SVCC), సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అజనీష్ బి లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. జరీనా వహాబ్, జయరాం కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More