నాగచైతన్య మైథలాజికల్ థ్రిల్లర్-టైటిల్ అనౌన్స్ చేసిన మహేష్ బాబు-వృషకర్మ అర్థమేంటో తెలుసా? అదిరిపోయిన చై లుక్

కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాగ చైతన్య అప్ కమింగ్ మూవీ టైటిల్ ను ఇవాళ మహేష్ బాబు అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు వృషకర్మ అనే పేరు ఫిక్స్ చేశారు. చై ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. వృషకర్మ మీనింగ్ ఏంటో ఇక్కడ చూసేయండి.  

Published on: Nov 23, 2025, 14:18:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నాగ చైతన్య అప్ కమింగ్ మైథలాజికల్ థ్రిల్లర్ టైటిల్ రివీలైంది. నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా ఇవాళ (నవంబర్ 23) ఈ సినిమా పేరును అనౌన్స్ చేశారు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వృషకర్మ అనే పేరు పెట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్స్ లో చైతన్య ఫస్ట్ లుక్ తో పాటు మూవీ టైటిల్ ను ప్రకటించాడు.

నాగ చైతన్య ఫస్ట్ లుక్ (x/urstrulyMahesh)
నాగ చైతన్య ఫస్ట్ లుక్ (x/urstrulyMahesh)

వృషకర్మ టైటిల్

నాగ చైతన్య పుట్టినరోజున ఆయన తదుపరి చిత్రం 'వృషకర్మ' ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను విడుదల చేసిడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సందర్భంగా ఆదివారం ఇలా ట్వీట్ చేశాడు. “మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చైతన్య. వృషకర్మ సాలిడ్ గా కనిపిస్తోంది. దీని కోసం ఎదురుచూస్తున్నా’’ అని మహేష్ ఎక్స్ లో పేర్కొన్నాడు. ఫస్ట్ లుక్ లో చైతన్య చేతిలో ఇనుప రాడ్ తో యాక్షన్ మోడ్ లో కనిపించాడు. ఈ లుక్ అదిరిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

చై రియాక్షన్

“ఈ గౌరవానికి ధన్యవాదాలు మహేష్ బాబు గారు! ఇది నాకు చాలా ముఖ్యం” అని నాగ చైతన్య మహేష్ పోస్టుకు రియాక్టయ్యాడు. ఆయన తర్వాత తన ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “ఎన్సీ24 టైటిల్ వృషకర్మ. కార్తీక్ దండు ఖచ్చితంగా మీ కోసం ఏదో ప్రత్యేకతను తీసుకువస్తున్నారు!” అని చై రాసుకొచ్చాడు. ఈ మూవీ హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా.. “పుట్టినరోజు శుభాకాంక్షలు చై!! ఇది మీ జీవితంలో అత్యుత్తమ సంవత్సరంగా ఉంటుందని ఆశిస్తున్నా’’ అని విషెస్ చెప్పింది.

వృషకర్మ అర్థం

'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న వృషకర్మ చిత్రానికి బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. చిత్ర టైటిల్, చైతన్య ఫస్ట్ లుక్ ను వివరిస్తూ మూవీ టీమ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

“ఈ చిత్రానికి శక్తివంతమైన 'వృషకర్మ' అని పేరు పెట్టారు. దీని అర్థం ధర్మబద్ధమైన పనులు చేసేవాడు. సినిమాలో నాగ చైతన్య పాత్రను ఇది సూచిస్తుంది” అని టీమ్ పేర్కొంది.

తండేల్ విక్టరీ

వృషకర్మ సినిమాలో నాగ చైతన్య, మీనాక్షి లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. 'లాపతా లేడీస్' ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ గా నటిస్తున్నాడు. 'కాంతార' ఫేమ్ అజనీష్ బి లోక్నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'తండేల్' చిత్రంతో చై కెరీర్ మరో మెట్టు పైకి ఎక్కింది. ఇది ఆయన కెరీర్ లో మొదటి రూ.100 కోట్ల సినిమాగా నిలిచింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More