NTRNeel: ముందుగానే ఎన్టీఆర్ బర్త్ డే ట్రీట్.. ప్రశాంత్ నీల్ మూవీ గ్లింప్స్ రిలీజ్ ఎప్పుడో తెలుసా? అఫీషియల్ అప్ డేట్

NTRNeel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా యాక్షన్ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కు ముహూర్తం ఖరారైంది. ఈ సినిమా అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Published on: May 18, 2026, 12:50:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

NTRNeel: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఫస్ట్ గ్లింప్స్’కు ముహూర్తం ఖరారైంది. తారక్ పుట్టినరోజు పురస్కరించుకుని, ఒక రోజు ముందే బర్త్ డే ట్రీట్ అందించాలని మేకర్స్ నిర్ణయించారు.

ఎన్టీఆర్ (x/NTRNeel)
ఎన్టీఆర్ (x/NTRNeel)

ఎన్టీఆర్ నీల్ గ్లింప్స్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతున్నారు. మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే . ఒక రోజు ముందు అంటే మే 19వ తేదీ రాత్రి సరిగ్గా 11:52 గంటలకు ఈ భారీ అప్‌డేట్‌ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు 'ఎన్టీఆర్‌నీల్ ఫిల్మ్' (NTRNeelFilm) అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్న వివరాలు నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి.

కో ఆర్టినేట్స్ తో

భారతదేశ భౌగోళిక కేంద్ర బిందువైన నాగ్‌పూర్ పరిసర ప్రాంతాల కోఆర్డినేట్స్‌ను షేర్ చేస్తూ, ‘దేశవ్యాప్త విధ్వంసక ప్రోటోకాల్’ ప్రారంభం కాబోతోందంటూ మేకర్స్ హింట్ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ మార్క్ భారీతనాన్ని చూపిస్తూ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాను శరవేగంగా చుట్టేస్తోంది.

ఊసరవెల్లితో

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు వెండితెరపై కూడా ఈ విధ్వంసాన్ని చూపించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. థియేటర్లలో రీ-రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఊసరవెల్లి’ 4K ప్రీమియర్ల ప్రదర్శన సమయంలో ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ఈ గ్లింప్స్‌ను అటాచ్ చేయనున్నారు. ఫిల్మ్ నగర్ వర్కింగ్ సర్కిల్స్ సమాచారం ప్రకారం, ఈ గ్లింప్స్ ఏకంగా మూడు నిమిషాల కంటే ఎక్కువ నిడివితో ఉండబోతోంది.

కేవలం చిన్న టీజర్‌లా కాకుండా సినిమా ప్రపంచాన్ని, అందులోని పాత్రల తీవ్రతను పరిచయం చేసేలా ఈ వీడియోను డిజైన్ చేశారు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాకు ‘డ్రాగన్’ (Dragon) అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ గ్లింప్స్ ద్వారానే టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

భారీ స్థాయిలో

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. కేజీఎఫ్ సిరీస్, సలార్ చిత్రాలతో భారతీయ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ప్రశాంత్ నీల్.. ఈ సినిమాను తన మునుపటి చిత్రాల కంటే మరింత భారీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఇంటెన్స్ పోస్టర్లలో తుఫాను బీచ్‌లు, హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులు కనిపించడం దర్శకుడి విజువల్ గ్రాండ్‌నెస్‌ను స్పష్టం చేస్తోంది. ఈ విజువల్స్ చూస్తుంటే థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త యాక్షన్ అనుభూతి లభించడం ఖాయం. ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఏడాది, అంటే 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

  1. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడు విడుదలవుతుంది?

ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను మే 19వ తేదీ రాత్రి 11:52 గంటలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు ఎంచుకున్న థియేటర్లలో విడుదల చేస్తారు.

2. థియేటర్లలో ఈ గ్లింప్స్ ఎక్కడ చూడవచ్చు?

ఎన్టీఆర్ చిత్రం ‘ఊసరవెల్లి’ 4K రీ-రిలీజ్ ప్రీమియర్ ప్రదర్శించే ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ఈ ప్రత్యేక గ్లింప్స్‌ను వెండితెరపై ప్రదర్శిస్తారు.

3. ఈ సినిమాకు ఏ టైటిల్ ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది?

ఈ చిత్రానికి ‘డ్రాగన్’ (Dragon) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. దీనిపై గ్లింప్స్ వీడియోలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More