Ntr Neel: బిగ్ అప్‌డేట్‌.. ఎన్టీఆర్‌-నీల్ మూవీ రిలీజ్ డేట్ ఇదే.. గ్లింప్స్ ఎప్పుడో చెప్పిన తార‌క్‌

Ntr Neel: సినీ లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అప్ డేట్ వచ్చేసింది.  ఎన్టీఆర్-నీల్ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మూవీ 2027 సమ్మర్ లో విడుదల కానుంది. 

Apr 21, 2026, 11:18:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ntr Neel: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు, సినీ లవర్స్ కు కిక్కిచ్చే న్యూస్ ఇది. ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన ఎన్టీఆర్-నీల్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. డ్రాగన్ అనే టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఈ చిత్రం విడుదల తేదీని ఇవాళ (ఏప్రిల్ 21) మేకర్స్ రిలీజ్ చేశారు.

పోస్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ (x/tarak9999)
పోస్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ (x/tarak9999)

ఎన్టీఆర్-నీల్ మూవీ

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ నుంచి బిగ్ అప్ డేట్ వచ్చింది. భారీ అంచనాలున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను మంగళవారం ప్రకటించారు. ఈ సినిమా జూన్ 11, 2027న థియేటర్లలోకి రానుంది. అలాగే ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడొస్తుందో కూడా తారక్ చెప్పాడు. మే 20, 2026న ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు ఎన్టీఆర్ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశాడు.

సమ్మర్ రేస్ లో

ఎన్టీఆర్-నీల్ మూవీ 2027 సమ్మర్ రేస్ కు సై అంటోంది. వచ్చే ఏడాది వేసవి వినోదాల కానుకగా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ ఏడాది చివర్లోనే ఈ మూవీ రిలీజ్ అవుతుందనే ప్రచారం సాగింది. కానీ ఈ చిత్రాన్ని 2027లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు రిలీజ్ డేట్ తో మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కాబోతున్న రెండో పెద్ద తెలుగు సినిమాగా ఎన్టీఆర్-నీల్ మూవీ నిలిచింది.

వారణాసి కూడా

రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా చేస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం వారణాసి కూడా వచ్చే ఏడాది సమ్మర్ లోనే రిలీజ్ కానుంది. ఈ మూవీ ఏప్రిల్ 7, 2027న థియేటర్లు రాబోతుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. ఈ వారణాసి చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్. ఇదో టైమ్ ట్రాటర్, గ్లోబ్ ట్రాటర్ గా తెరకెక్కుతోంది.

భారీ హైప్

కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ అనగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ లుక్ తో ఆ హైప్ మరింత పెరిగింది. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోందని తెలిసింది. ఇప్పటికే మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

ప్రశాంత్ నీల్ యాక్షన్ మేకింగ్, ఎన్టీఆర్ స్టైల్ యాక్టింగ్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. వార్ 2 ఫెయిల్యూర్ తో నిరాశ పడ్డ తారక్ ఫ్యాన్స్ కు ఈ ప్రశాంత్ నీల్ ఫిల్మ్ మంచి ట్రీట్ లా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More