Rajamouli: మీరు మారిపోయారు సార్! మళ్లీ వారణాసి షూటింగ్‌కు రాజ‌మౌళి బ్రేక్‌.. ఛ‌లో అంటూ వెకేష‌న్‌కు మ‌హేష్ బాబు

Rajamouli: రాజమౌళి సినిమాలకు షూటింగ్ బ్రేక్ హా.. అందంతా ఈజీ కాదు అనే అందరూ అంటారు. కానీ వారణాసి విషయంలో మాత్రం రాజమౌళి మారిపోయారనే కామెంట్లు వస్తున్నాయి. ఎందుకంటే ఈ మూవీ షూటింగ్ కు అతను మరోసారి బ్రేక్ ఇచ్చాడు. ఇక ఛాన్స్ దొరికిందే చాలన్నట్లుగా మహేష్ బాబు వెకేషన్ కు వెళ్లిపోయాడు.

Updated on: Apr 21, 2026, 09:43:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rajamouli: పని రాక్షసుడు, పర్ఫెక్షనిస్ట్, బ్రేక్ ఇవ్వడు.. ఎస్ ఎస్ రాజమౌళి గురించి చెప్పమంటే అతనితో పనిచేసిన హీరోలు చేప్పే ఆన్సర్లు ఇవి. అవును.. రాజమౌళి నిజంగానే పని రాక్షసుడు. తను అనుకున్న విధంగా సినిమాను తెరకెక్కించడంలో పర్ఫెక్షనిస్ట్. ఒక్క మూవీకి కమిట్ అయితే మాత్రం బ్రేక్ లేకుండా షూటింగ్ ను కొనసాగిస్తాడని రాజమౌళికి పేరు ఉంది. కానీ వారణాసి విషయంలో మాత్రం అతను మారిపోయాడనే కామెంట్లు వస్తున్నాయి.

ఎస్ఎస్ రాజమౌళి (AP)
ఎస్ఎస్ రాజమౌళి (AP)

వారణాసికి బ్రేక్

సాధారణంగా అయితే తన సినిమా షూటింగ్ లకు ఎస్ ఎస్ రాజమౌళి బ్రేక్ ఇవ్వడన్నది ఇండస్ట్రీ వర్గాల మాట. తాను అనుకున్న విధంగా ఔట్ పుట్ వచ్చేంత వరకూ ఎవరినీ వదిలిపెట్టడు. కానీ ఇప్పుడు రాజమౌళి మారిపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోసారి ‘వారణాసి’ మూవీ షూటింగ్ కు రాజమౌళి బ్రేక్ ఇవ్వడమే ఇందుకు కారణం.

పాస్ పోర్ట్ తీసుకుని

రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘వారణాసి’. ఈ మూవీ షూటింగ్ అనౌన్స్ చేయగానే సోషల్ మీడియాలో రాజమౌళి పెట్టిన పోస్టు ఒకటి వైరల్ గా మారింది. మహేష్ బాబు పాస్ పోర్టును రాజమౌళి తీసుకున్నట్లుగా అందులో ఉంది. మహేష్ బాబు టైమ్ దొరికితే చాలు వెకేషన్లకు విదేశాలకు వెళ్లిపోతుంటాడు. కానీ వారణాసి సినిమా విషయంలో మాత్రం రాజమౌళి ఆ ఛాన్స్ ఇవ్వడని అంతా అనుకున్నారు.

వెకేషన్ కు మహేష్ బాబు

వారణాసి మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత పరిస్థితి మారిపోయింది. మూవీ షూటింగ్ కు వారణాసి బ్రేక్ ఇవ్వడం స్టార్ట్ అయింది. మహేష్ బాబు గతంలో తన పాస్ పోర్ట్ చూపిస్తూ కూతురితో కలిసి ఎయిర్ పోర్టులో కనిపించిన వీడియోలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి సూపర్ స్టార్ ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చాడు.

తన భార్య నమ్రతా శిరోద్కర్ తో కలిసి మహేష్ బాబు ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమయ్యాడు. కానీ మహేష్ ఒక్కడే లోపలకిి వెళ్లినట్లు వీడియోలో కనిపించింది. ఈ వీడియోలో గడ్డంతో, జులపాల జట్టుతో మహేష్ బాబు లుక్ అదిరిపోయింది.

అదే కారణమా?

వారణాసి మూవీ షూటింగ్ లో ఎస్ ఎస్ రాజమౌళి జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే మూవీ 70 శాతం షూటింగ్ కంప్లీట్ అయిందని టాక్. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉండటంతో షూటింగ్ కు రాజమౌళి బ్రేక్ ఇచ్చారని సమాచారం. ఈ సినిమాను ఏప్రిల్ 7, 2027న రిలీజ్ చేయనున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More