PEDDI: అసలు పెద్ది ప్లాన్ ఏంటీ? రిలీజ్ డేట్ ఎప్పుడు? వాయిదాకు కారణాలు ఇవేనా?

PEDDI: చివరకు ఊహాగానాలే నిజమయ్యాయి. పెద్ది మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడింది. జూన్ లో ఈ సినిమా విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ డేట్ మాత్రం ఇవ్వలేదు. అసలు పెద్ది ప్లాన్ ఏంటీ?  అని ఫ్యాన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు.

Apr 16, 2026, 12:52:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

PEDDI: మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాల్లో ‘పెద్ది’ ఒకటి. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్, సినీ లవర్స్ అత్యంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం మరోసారి ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేస్తూ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేశారు. ఈ వాయిదాకు కారణాన్ని మాత్రం ప్రకటించలేదు. బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నామని మాత్రమే పేర్కొన్నారు.

పెద్ది సినిమాలో రామ్ చరణ్
పెద్ది సినిమాలో రామ్ చరణ్

పెద్ది రిలీజ్ డేట్

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ అనేది బేతాళ ప్రశ్నగా మారిందనే ట్రోల్స్ వస్తున్నాయి. నిజానికి ఈ మూవీ మార్చి 27న రిలీజ్ అవుతుందని ఫస్ట్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడేమో మళ్లీ జూన్ లో మూవీ వస్తుందని అనౌన్స్ చేశారు.

డేట్ ఎందుకు ఇవ్వలేదు?

పెద్ది మూవీ జూన్, 2026లో రిలీజ్ అవుతుందని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ మాత్రం ఇవ్వలేదు. ఇందుకు కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. జూన్ 4న కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ కూడా మరోసారి పోస్ట్ పోన్ అయ్యే సూచనలు ఉన్నాయని టాక్. ఒకవేళ టాక్సిక్ పోస్ట్ పోన్ అయితే పెద్ది మూవీ ఆ డేట్ కు వచ్చే ఛాన్స్ ఉంది.

రీజన్ ఇదేనా?

ఏప్రిల్ 30న పెద్ది కచ్చితంగా రిలీజ్ అవుతుందనే అంచనాలు కలిగాయి. ఇటీవల రాకాస మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో కూడా రామ్ చరణ్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ వాయిదా పడింది. అయితే దీనికి ప్రధాన కారణం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆలస్యం కావడమే అని టాక్.

పెద్ది మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే మూవీ ఫస్ట్ పార్ట్ బీజీఎం కంప్లీట్ అయింది. కానీ సెకండ్ పార్ట్ ఇంకా పెండింగ్ లో ఉందని అంటున్నారు. సినిమా ఫైనల్ ఎడిట్ చూసిన తర్వాతే సెకండ్ పార్ట్ కు బీజీఎం కంపోజ్ చేయాలని రెహమాన్ అనుకున్నాటా. అందుకే లేట్ అయిందని అంటున్నారు.

స్పెషల్ సాంగ్

పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ సాంగ్ లో డ్యాన్స్ కోసం హీరోయిన్ సెర్చింగ్ కొనసాగుతూనే వచ్చింది. చివరకు మృణాల్ ఠాకూర్‌ ను మేకర్స్ ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఈ స్పెషల్ సాంగ్ కూడా త్వరలోనే రెడీ కాబోతుందని తెలిసింది.

ఆలస్యం విషం

సినిమా విషయంలో ముఖ్యంగా పెద్ది లాంటి భారీ స్కేల్ మూవీ విషయంలో ఆలస్యం అనేది విషంతో సమానమనేది ఇండస్ట్రీ పండితుల మాట. ఇప్పటికే గ్లింప్స్, సాంగ్స్ తో పెద్దిపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ లోనే మూవీ రిలీజ్ చేసి ఉంటే, సమ్మర్ కు పర్ఫెక్ట్ గా ఉండేది. కానీ అది కుదరలేదు. మరి జూన్ లోనైనా ఈ మూవీ వస్తుందో లేదో చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More