Ram Charan Dacoit Review: డెకాయిట్ మూవీ బాగా ఎంజాయ్ చేశాను.. శేష్, మృణాల్ అద్భుతం: రామ్ చరణ్ డెకాయిట్ రివ్యూ

Ram Charan Dacoit Review: బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తున్న 'డెకాయిట్' సినిమాపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసల జల్లు కురిపించారు. అడివి శేష్ నటన అద్భుతమని, సాంకేతికంగా సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉందని చరణ్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

Apr 14, 2026, 15:58:37 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ram Charan Dacoit Review: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి సత్తా చాటిన ఈ మూవీపై ఇప్పుడు సెలబ్రిటీల ప్రశంసలు మొదలయ్యాయి. తాజాగా 'గ్లోబల్ స్టార్' రామ్ చరణ్ ఈ సినిమాను చూసి, మూవీ టీమ్ ను అభినందిస్తూ ఎక్స్‌ లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Ram Charan Dacoit Review: డెకాయిట్ మూవీ బాగా ఎంజాయ్ చేశాను.. శేష్, మృణాల్ అద్భుతం: రామ్ చరణ్ డెకాయిట్ రివ్యూ
Ram Charan Dacoit Review: డెకాయిట్ మూవీ బాగా ఎంజాయ్ చేశాను.. శేష్, మృణాల్ అద్భుతం: రామ్ చరణ్ డెకాయిట్ రివ్యూ

హరిగా శేష్.. డెప్త్ ఇచ్చిన మృణాల్!

డెకాయిట్ సినిమాలో నటీనటుల ప్రతిభను రామ్ చరణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. "డెకాయిట్ సినిమా చూశాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను. హరి పాత్రలో అడివి శేష్ తన నటనతో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లారు. శేష్ నటన చాలా కాలం గుర్తుండిపోతుంది. ఇక మృణాల్ ఠాకూర్ తన పాత్రకు ప్రాణం పోశారు. ఆమె నటనలో ఉన్న డెప్త్ సినిమాకు పెద్ద అసెట్" అని చరణ్ కొనియాడారు. కేవలం లీడ్ పెయిర్ మాత్రమే కాకుండా, కీలక పాత్రలో నటించిన అనురాగ్ కశ్యప్, ఇతర నటీనటులు కూడా గట్టి ఇంపాక్ట్ చూపించారని మెచ్చుకున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ విలువలపై ప్రశంసలు

సాంకేతికంగా ఈ సినిమా చాలా ఉన్నతంగా ఉందని రామ్ చరణ్ ప్రశంసించారు. "సుప్రియ యార్లగడ్డ, అన్నపూర్ణ స్టూడియోస్ ఈ కథను నమ్మి ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో సినిమాను ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. చిత్ర యూనిట్ మొత్తానికి నా అభినందనలు" అని చరణ్ ట్వీట్ చేశారు.

జోరు మీదున్న 'డెకాయిట్'

ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాకు చరణ్ వంటి అగ్ర హీరో సపోర్ట్ లభించడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చిన్న సినిమాలైనా, కంటెంట్ ఉన్న చిత్రాలైనా అగ్ర హీరోలు ఇలా ప్రోత్సహించడం టాలీవుడ్‌లో మంచి పరిణామమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అడివి శేష్ కెరీర్‌లో 'డెకాయిట్' అతిపెద్ద కమర్షియల్ హిట్‌గా నిలిచే దిశగా దూసుకుపోతోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. రామ్ చరణ్ 'డెకాయిట్' సినిమా గురించి ఏమని ట్వీట్ చేశారు?

అడివి శేష్ నటనను, మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్‌ను రామ్ చరణ్ అభినందించారు. సినిమా సాంకేతికంగా చాలా బాగుందని, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.

2. సినిమాలో అడివి శేష్ పాత్ర పేరు ఏమిటి?

ఈ చిత్రంలో అడివి శేష్ 'హరి' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించారు.

3. 'డెకాయిట్' నిర్మాత ఎవరు?

ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు.

4. డెకాయిట్ సినిమా బాక్సాఫీస్ స్టేటస్ ఏంటి?

కంటెంట్ బాగుండటంతో 'డెకాయిట్' విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, బాక్సాఫీస్ వద్ద 'క్లీన్ హిట్'గా నిలిచింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More