Nag Ashwin: మృణాల్ ఠాకూర్ ను ఆకాశానికి ఎత్తేసిన నాగ అశ్విన్.. ఆ దిగ్గజ హీరోయిన్లతో పోలుస్తూ క్రేజీ కామెంట్స్!

Nag Ashwin On Mrunal Thakur: 'డెకాయిట్' సక్సెస్ మీట్‌లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌పై  దర్శకుడు నాగ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమెను లెజెండరీ నటీమణులు మధుబాల, స్మితా పాటిల్‌లతో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Apr 13, 2026, 14:54:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్, బాలీవుడ్‌లో దూసుకుపోతున్న నటి మృణాల్ ఠాకూర్. తాజాగా ఆమె నటించిన 'డెకాయిట్' (Dacoit) చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. ఈ సినిమా సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన 'కల్కి 2898 AD' దర్శకుడు నాగ్ అశ్విన్.. మృణాల్ ఠాకూర్ నటన గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

మృణాల్ ఠాకూర్ పై నాగ్ అశ్విన్ కామెంట్లు
మృణాల్ ఠాకూర్ పై నాగ్ అశ్విన్ కామెంట్లు

నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే?

మృణాల్‌ ఠాకూర్ ను నాగ్ ప్రశంసల్లో ముంచెత్తాడు. "మృణాల్, నీ నటన అద్భుతం. నువ్వు ఎంచుకునే కథల విషయంలో నేను ఎప్పుడూ కాస్త ఆందోళనగా ఉంటాను. నువ్వు ఏదైనా సాదాసీదా సినిమా చేసినప్పుడు, ఇంత మంచి నటి ఇలాంటి సినిమా ఎందుకు చేస్తోంది? అనిపిస్తుంది. నీకు అంతకంటే గొప్ప పాత్రలు చేసే అర్హత ఉంది’’ అని నాగ్ అశ్విన్ తెలిపాడు.

మధుబాలలా

‘‘ముఖ్యంగా భావోద్వేగాలు, లోతైన బాధ ఉన్న పాత్రలను మృణాల్ పండించే తీరు చూస్తుంటే.. నాటి మధుబాల, స్మితా పాటిల్ గుర్తుకొస్తారు. ఇప్పుడున్న కాలంలో నీలా నటించే వారు చాలా అరుదు. అందుకే ఆశామాషీ సినిమాలు చేయకుండా, నీ నటనకు ప్రాధాన్యత ఉన్న మంచి కథలనే ఎంచుకో" అని నాగ్ అశ్విన్ అన్నాడు.

డెకాయిట్ జోరు

షనీల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన 'డెకాయిట్' చిత్రం ఏప్రిల్ 10న విడుదలైంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ యాక్షన్ రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకులను అలరిస్తోంది.

ప్రేయసి మోసం వల్ల జైలుకు వెళ్లిన హరిదాస్ అనే వ్యక్తి, విడుదలయ్యాక ప్రతీకారం తీర్చుకుంటూనే నేర సామ్రాజ్యంలో ఎలా చిక్కుకున్నాడనేది ఈ చిత్ర కథ. మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ, కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టడం విశేషం.

వరుస ప్రాజెక్టులతో బిజీ

నాగ అశ్విన్ ప్రస్తుతం ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న 'కల్కి 2898 AD' సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు మృణాల్ ఠాకూర్ తన తదుపరి చిత్రం 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' విడుదలకు సిద్ధమవుతోంది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More