Dacoit Collection: అడివి శేష్ డెకాయిట్ బాక్సాఫీస్ రిపోర్ట్.. మూడో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే? సండే కూడా అలాగే

Dacoit Collection: అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'డెకాయిట్' థియేటర్లో ఆడియన్స్ ను అలరిస్తోంది. ఈ మూవీ మూడు రోజుల కలెక్షన్ల వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Apr 13, 2026, 05:43:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Dacoit Collection: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన క్రేజీ ప్రాజెక్ట్ 'డెకాయిట్'. అనేక వాయిదాల తర్వాత థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే పక్కా యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో మొదటి వీకెండ్‌లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు రాణించిందో చూద్దాం.

డెకాయిట్ సినిమాలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్
డెకాయిట్ సినిమాలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్

డెకాయిట్ కలెక్షన్లు

ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకర్ సక్నిల్క్ నివేదిక ప్రకారం, విడుదలైన మూడో రోజైన ఆదివారం (ఏప్రిల్ 12) డెకాయిట్ రూ. 6.59 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. సాధారణంగా అయితే సండే కలెక్షన్లు పెరగాల్సింది. కానీ డెకాయిట్ మూవీ వసూళ్లు మాత్రం నిలకడగా కొనసాగాయి.

మొత్తం వసూళ్లు

మొదటి రోజు శుక్రవారం రూ. 6.55 కోట్లు, రెండో రోజు శనివారం రూ. 6.85 కోట్లు వసూలు చేసిన డెకాయిట్ సినిమా.. మూడో రోజు కూడా అదే స్థాయిని కొనసాగించింది. దీంతో ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు ఈ మూవీ రూ. 23.41 కోట్ల గ్రాస్ వసూళ్లను, రూ. 19.99 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది.

డెకాయిట్ గురించి

కొత్త దర్శకుడు షనీల్ డియో తెరకెక్కించిన డెకాయిట్ చిత్రంలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. విడిపోయిన ఇద్దరు ప్రేమికులు తమ జీవితాలను మలుపు తిప్పే కొన్ని దొంగతనాలు చేసేందుకు మళ్లీ ఎలా ఏకమయ్యారనేది ఈ సినిమా ప్రధాన కథ. ఇందులో ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలు పోషించారు.

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించగా, సునీల్ నారంగ్ సహ సమర్పకులుగా వ్యవహరించారు. అడవి శేష్ స్వయంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించడం విశేషం.

విమర్శకులు ఏమన్నారంటే?

సినిమా కథనం కాస్త రొటీన్‌గా ఉందన్నది విమర్శకుల మాట. "ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకోవడం, విడిపోవడం, ఆపై ప్రతీకారం కోసం ప్రయత్నించడం, చివరకు మళ్లీ కలుసుకోవడం.. ఇలాంటి కథలు ఇదివరకే వచ్చాయి. కథా గమనం ఊహించిన విధంగానే సాగడం ఈ సినిమాకు పెద్ద మైనస్" అని డెకాయిట్ మూవీపై రివ్యూలు వచ్చాయి.

నిజానికి డెకాయిట్ చిత్రం మార్చి 19నే విడుదల కావాల్సింది. కానీ ఏప్రిల్ 10కు రిలీజ్ చేశారు. మార్చి 19న ధురంధర్ 2 విడుదల కావడం డెకాయిట్ మేకర్స్ తన మూవీని అప్పుడు పోస్ట్ పోన్ చేశారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More