Dacoit Collection: డెకాయిట్ 4 రోజుల కలెక్షన్స్ ఇవే- ఇండియాలో ఒక్కరోజే 2.70 కోట్లు- అడివి శేష్ హిట్ 2 రికార్డుకు చేరువలో!
Dacoit 4 Days Box Office Collections: వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న అడివి శేష్ తాజాగా 'డెకాయిట్: ఒక ప్రేమ కథ'తో బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తున్నారు. మొదటి వారాంతం ముగిసేసరికి డెకాయిట్ చిత్రం రూ. 20 కోట్ల మార్కును దాటి దూసుకుపోతోంది.
సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన షానియల్ డియో తెరకెక్కించిన 'డెకాయిట్' సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మొదటి మూడు రోజులు నిలకడైన వసూళ్లను సాధించింది.

నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా
ట్రేడ్ వెబ్ సైట్ సక్నిల్క్ (Sacnilk) లెక్కల ప్రకారం, సోమవారం (ఏప్రిల్ 13) వర్కింగ్ డే కావడంతో కలెక్షన్స్‌లలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ.. ఇండియాలో దాదాపు రూ. 2.70 కోట్లు రాబట్టింది. దీంతో నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా డెకాయిట్ సినిమా మొత్తంగా రూ. 22.50 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది.
శుక్రవారం (ఏప్రిల్ 10) రూ. 6.55 కోట్లతో మొదలైన డెకాయిట్ చిత్ర ప్రయాణం, శని (రూ. 6.85 కోట్లు), ఆదివారాల్లో (రూ. 6.40 కోట్లు) అదే జోరును కొనసాగించింది. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరించినప్పటికీ, హిందీతో పోలిస్తే తెలుగు వెర్షన్‌కే ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.
'హిట్-2' రికార్డుకు చేరువలో.. 'మేజర్' లక్ష్యం దిశగా!
ప్రస్తుతం ఉన్న వసూళ్ల ట్రెండ్‌ను బట్టి చూస్తే, అడివి శేష్ గత చిత్రం 'హిట్: ది సెకండ్ కేస్' సాధించిన లైఫ్ టైమ్ కలెక్షన్లను (రూ. 25.92 కోట్లు) ఈ వారం ఆఖరి లోపు డెకాయిట్ దాటే అవకాశం ఉంది.
అయితే, అడివి శేష్ కెరీర్‌లోనే భారీ కలెక్షన్స్ సాధించిన 'మేజర్' (రూ. 41.03 కోట్లు) రికార్డును అందుకోవాలంటే ఈ సినిమా మరికొన్ని రోజులు ఇదే జోరును ప్రదర్శించాల్సి ఉంటుంది. సాధారణంగా అడివి శేష్ సినిమాలు 'మౌత్ టాక్'తో పుంజుకుంటాయి కాబట్టి, లాంగ్ రన్‌లో ఈ చిత్రం మంచి లాభాలను ఆర్జిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
నాని ప్రశంసల జల్లు: "శేష్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్"
మరోవైపు డెకాయిట్ సినిమాపై ఇండస్ట్రీ నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని చూసి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "డెకాయిట్ పక్కా బ్లాక్ బస్టర్. ఈ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అస్సలు మిస్ కావద్దు," అని పేర్కొన్నారు. అడివి శేష్ నటన తన కెరీర్‌లోనే అత్యుత్తమమని కొనియాడారు. అలాగే మృణాల్ ఠాకూర్ తన పాత్రలో ఒదిగిపోయిన తీరును, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ విలువలను నాని ప్రత్యేకంగా అభినందించారు.
సినిమా నేపథ్యం
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన డెకాయిట్ చిత్రంలో ప్రకాష్ రాజ్, సునీల్, అనురాగ్ కశ్యప్, అతుల్ కుల్కర్ణి వంటి భారీ తారాగణం నటించింది. మార్చిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం, కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఎట్టకేలకు గత వారం థియేటర్లలోకి వచ్చింది. మిశ్రమ రివ్యూలు వచ్చినప్పటికీ, శేష్ మార్క్ యాక్షన్ అండ్ ఎమోషన్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


