Samantha Peddi: బ్లాక్‌బస్టర్ వైబ్స్ వస్తున్నాయి.. రామ్ చరణ్ ‘పెద్ది’కి సమంత బెస్ట్ విషెస్.. వైరల్ అవుతున్న పోస్ట్
Samantha Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ జూన్ 4న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ టైమ్‌లో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా రామ్ చరణ్‌కు, సినిమా యూనిట్‌కు స్పెషల్ బెస్ట్ విషెస్ చెప్పారు.
Samantha Peddi: టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం ‘పెద్ది’ థియేటర్లలోకి వచ్చేస్తోంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మీద ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. జూన్ 3 (ఈరోజు) నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున పెయిడ్ ప్రీమియర్స్ పడుతుండగా, రేపు (జూన్ 4) సినిమా వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ క్రమంలోనే సినిమా మీద ఉన్న హైప్‌ను మరింత పెంచుతూ స్టార్ హీరోయిన్ సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక క్యూట్ పోస్ట్ పెట్టారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత బెస్ట్ విషెస్
సమంత తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ‘పెద్ది’ సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ఈ సినిమా కోసం తను ఎంతగా వెయిట్ చేస్తుందో రాసుకొచ్చారు. తన బెస్ట్ ఫ్రెండ్, ‘రంగస్థలం’ కో-స్టార్ అయిన రామ్ చరణ్‌తో పాటు డైరెక్టర్ బుచ్చిబాబు, ఇతర చిత్ర బృందానికి హార్ట్‌ఫుల్‌గా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మధ్య కాలంలో ఓ మూవీ కోసం ఇంతలా ఎప్పుడూ ఎదురు చూడలేదని, కచ్చితంగా ఈ మూవీలో రామ్ చరణ్ ఇరగదీస్తాడని కాన్ఫిడెంట్ గా చెప్పింది.
ఆయన ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డట్లు కూడా తెలిపింది. బ్లాక్‌బస్టర్ వైబ్స్ వస్తున్నాయని ఆమె అనడం విశేషం. సమంత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.
'రంగస్థలం' సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
సమంత ఈ పోస్ట్ పెట్టగానే మెగా ఫ్యాన్స్ 'రంగస్థలం' సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తున్నారు. చరణ్-సమంత (చిట్టిబాబు-రామలక్ష్మి) హిట్ పెయిర్‌గా బ్లాక్‌బస్టర్ కొట్టారు. పైగా ఆ సినిమాకు సుకుమార్ డైరెక్టర్ అయితే, ఇప్పుడు ఆయన శిష్యుడు బుచ్చిబాబు సానా 'పెద్ది'ని తెరకెక్కించడం విశేషం. అందుకే సమంత కూడా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వాలని పర్సనల్‌గా కోరుకుంటున్నారు.
మరోవైపు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ‘పెద్ది’ సినిమాకు టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఓపెనింగ్ డే కలెక్షన్స్ అదిరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో శివరాజ్‌కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ లాంటి సీనియర్ స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు.
సమంత నెక్స్ట్ సినిమా ఏంటి?
ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. తన సొంత బ్యానర్, రాజ్ అండ్ డీకేల నిర్మాణంలో వస్తున్న ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మొదట మే నెలలో రిలీజ్ కావాల్సి ఉన్నా.. ఐపీఎల్ సీజన్ కారణంగా వాయిదా పడి, ఫైనల్‌గా జూన్ 19, 2026 న థియేటర్లలోకి రాబోతోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఎవరికి బెస్ట్ విషెస్ చెప్పారు?
సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమాకు బెస్ట్ విషెస్ చెబుతూ, డైరెక్టర్ బుచ్చిబాబుకు, చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు?
‘పెద్ది’ సినిమా జూన్ 4, 2026 న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో దీని స్పెషల్ ప్రీమియర్ షోలు జూన్ 3 నుంచే ప్రారంభమయ్యాయి.
సమంత నెక్స్ట్ రాబోయే సినిమా ఏది?
సమంత లీడ్ రోల్‌లో నటించిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) జూన్ 19, 2026 న థియేటర్లలోకి రాబోతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


