Deewana Movie Review: దీవానా మూవీ రివ్యూ.. ప్రేమికుడిగా హర్షిత్ రెడ్డి ఊరమాస్ అవతార్.. ఈ రొమాంటిక్ డ్రామా ఎలా ఉందంటే?

Deewana Movie Review: దీవానా.. తాజాగా థియేటర్లలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ డ్రామా మూవీ. హర్షిత్ రెడ్డి ఊరమాస్ లుక్ లో, వన్ సైడ్ లవ్ ప్రేమికుడిగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకోండి. ఒక రోజు ఆలస్యంగా ఈ మూవీ శనివారం (జూన్ 20) థియేటర్లలోకి వచ్చింది.

Published on: Jun 20, 2026, 11:39:03 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Deewana Movie Review: దీవానా మూవీ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రావడంతోనే రిలీజ్ కు ముందే మంచి క్రేజ్ నెలకొంది. యంగ్ టాలెంట్ హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేగలై లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామా ఇది. ఈ శనివారం (జూన్ 20న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.

Deewana Movie Review: దీవానా మూవీ రివ్యూ.. ప్రేమికుడిగా హర్షిత్ రెడ్డి ఊరమాస్ అవతార్.. ఈ రొమాంటిక్ డ్రామా ఎలా ఉందంటే?
Deewana Movie Review: దీవానా మూవీ రివ్యూ.. ప్రేమికుడిగా హర్షిత్ రెడ్డి ఊరమాస్ అవతార్.. ఈ రొమాంటిక్ డ్రామా ఎలా ఉందంటే?

కొత్త దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి టాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారితీసేలా రూపొందించిన ఈ క్రేజీ రొమాంటిక్ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూడండి.

దీవానా మూవీ కథేంటంటే?

దీవానా మూవీ కథ విషయానికి వస్తే.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మున్నా (హర్షిత్ రెడ్డి) ఒక బాధ్యత లేని, అల్లరి చిల్లరగా తిరిగే యువకుడు. ఏ పనీపాటా లేకుండా ఎప్పుడూ తన ఫ్రెండ్స్‌తో కలిసి రోడ్ల మీద తిరగడం, లోకల్ గొడవల్లో తలదూర్చడం, కాలక్షేపం చేయడమే అతని రోజువారీ పని. ఇలాంటి టైమ్‌లోనే మున్నాకు ఒక ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే అమూల్య (స్నేహ మణిమేగలై) పరిచయం అవుతుంది.

అమూల్యను చూడగానే మున్నా పీకల్లోతు ప్రేమలో మునిగిపోతాడు. ఆమె మనసు గెలుచుకోవడానికి పదే పదే వెంటపడుతూ వేధించడం మొదలుపెడతాడు. కానీ అమూల్య మాత్రం అతని ప్రేమను అస్సలు ఒప్పుకోదు సరి కదా.. మున్నా ప్రవర్తనను దారుణంగా కడిగిపారేస్తుంది. ఆ తర్వాత మున్నా జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? తన తప్పును తెలుసుకుని అతను ఎలా బాధ్యతాయుతమైన వ్యక్తిగా మారాడు? చివరకు వీళ్లిద్దరి ప్రేమ కథ ఏ తీరానికి చేరింది? అనేది తెలియాలంటే సినిమాను చూడాలి.

'దీవానా' మూవీ విశేషాలు

- ప్రధాన నటీనటులు: హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేగలై, నరేష్, ఝాన్సీ

- దర్శకుడు: శ్రీకాంత్ సంగిశెట్టి

- నిర్మాతలు: ఆహా మీడియా, వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి

- మ్యూజిక్ డైరెక్టర్: ఈశ్వర్ చంద్

- సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు

దీవానా మూవీ.. ఏవి బాగున్నాయంటే?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో వచ్చిన అర్థవంతమైన సినిమాల్లో 'దీవానా' ఖచ్చితంగా నిలుస్తుంది. ఈ కథలో రాసుకున్న ప్రతి పాత్రకు ఒక ప్రాధాన్యత ఉంటుంది. రైటింగ్ టీమ్ చేసిన క్యారెక్టరైజేషన్ వర్క్ సినిమాకు అతిపెద్ద బలం. హీరో హర్షిత్ రెడ్డి ఒక పిచ్చి ప్రేమికుడిగా అద్భుతమైన నటనను కనబరిచాడు. గత ప్రాజెక్ట్స్‌లో పర్వాలేదనిపించినా, ఈ సినిమాలో మాత్రం మున్నా పాత్రలో జీవించేశాడు. క్లైమాక్స్ సీన్స్ లో అతని నటన గుండెలను పిండేస్తుంది.

సినిమాను రియలిస్టిక్ లొకేషన్స్‌లో షూట్ చేయడం వల్ల సహజత్వం బాగా కుదిరింది. ముఖ్యంగా సెకండాఫ్ చాలా బాగుంటుంది. భావోద్వేగమైన సీన్స్, తండ్రీకొడుకుల బంధంలాంటివి ఆకట్టుకుంటాయి. అటు హీరోయిన్ స్నేహ కూడా తన నటనతో మెప్పించింది.

దీవానా.. ఏవి మైనస్ అయ్యాయంటే?

సినిమా ఫస్టాఫ్ కొంచెం నెమ్మదిగా సాగుతుంది. సెకండాఫ్‌లో మంచి కిక్ ఇవ్వడం కోసం ఫస్టాఫ్ ను ఏదో సాదాసీదాగా నడిపినట్లు అనిపిస్తుంది. ఇక హీరోయిన్ వెంట హీరో పడటం అనేది ఎన్నో సినిమాల్లో చూస్తేనే వస్తున్నాం. ఈ పార్ట్ అంతా కాస్త రొటీన్ గా అనిపిస్తుంది. మూవీలో కొన్ని ఎమోషనల్ ఎపిసోడ్స్ ఇబ్బందికరంగా అనిపిస్తాయి. అందుకేనేమో ఈ సినిమాకు ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఇవి అందరు ఆడియెన్స్ కు కనెక్ట్ కాకపోవచ్చు.

టెక్నికల్ బ్రిలియన్స్

టెక్నికల్ పరంగా చూస్తే ఈ దీవానా సినిమాకు సంగీత దర్శకుడు ఈశ్వర్ చంద్ 'సెకండ్ హీరో' అని చెప్పాలి. ఆయన అందించిన లవ్ ట్రాక్స్, కీలకమైన సీన్స్‌లో వచ్చే క్రేజీ ర్యాప్ సాంగ్స్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలివేట్ చేశాయి. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ గీతా ఆర్ట్స్ మార్క్ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. హృషికేష్ పాసపాల్ ఎడిటింగ్ ఫర్వాలేదు.

చివరిగా చెప్పాలంటే.. 'దీవానా' అనేది స్వచ్ఛమైన మనసుతో తీసిన ఒక ఇంటెన్స్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా. ఫస్టాఫ్ కాస్త స్లోగా ఉన్నా.. సెకండాఫ్‌లోని ఎమోషనల్ డెప్త్, క్లైమాక్స్, హర్షిత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కోసం ఈ వీకెండ్‌లో థియేటర్లలో ఖచ్చితంగా చూడదగ్గ మూవీ.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More