Payal Radhakrishna: మరో రష్మికలా కన్నడ బ్యూటీ- తెలుగింటికే కోడలు అవుతానని పాయల్ రాధాకృష్ణ కామెంట్స్- 4 రోజులుగా వైరల్!

Payal Radhakrishna About Marriage Telugu Guy Like Rashmika Mandanna: మరో కన్నడ బ్యూటి పాయల్ రాధాకృష్ణ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా దారిలోనే నడవాలనుకుంటుంది. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ ప్రెస్ మీట్‌లో హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ పెళ్లిపై చేసిన కామెంట్స్ గత నాలుగు రోజులుగా వైరల్ అవుతున్నాయి.

Published on: May 12, 2026, 11:15:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Payal Radhakrishna About Marriage Telugu Guy: తెలుగులో ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా నిలదొక్కుకుంటున్న మరో కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ. ఆహా ఓటీటీ సిరీస్ తరగతి గది దాటితో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాధాకృష్ణ సుహాస్ ప్రసన్నవదనం సినిమాతో హీరోయిన్‌గా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత చౌర్యపాఠం సినిమాతో అలరించిన పాయల్ రాధాకృష్ణ ఇటీవలే పాపం ప్రతాప్ మూవీలో నటనతో మెప్పించింది.

మరో రష్మికలా కన్నడ బ్యూటీ- తెలుగింటికే కోడలు అవుతానని పాయల్ రాధాకృష్ణ కామెంట్స్- 4 రోజులుగా వైరల్!
మరో రష్మికలా కన్నడ బ్యూటీ- తెలుగింటికే కోడలు అవుతానని పాయల్ రాధాకృష్ణ కామెంట్స్- 4 రోజులుగా వైరల్!

త్రిగుణ్ హీరోగా

ఇప్పుడు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ. ఈ సినిమాలో త్రిగుణ్ హీరోగా చేశాడు. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాను సీహెచ్‌వీఎస్ఎన్ బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మాతగా నిర్మించారు.

మే 15 శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల రామ్ దాస్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించారు. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రెస్ మీట్‌లో తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చేసిన హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక్కడే సెటిల్ అవ్వాలని

హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. నాకు గుర్తింపు ఇచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమ. నేను ఇక్కడే సెటిల్ అవ్వాలని భావిస్తున్నాను. వరుసగా ఇక్కడ సినిమాలు రావడం, తాజాగా ‘పాపం ప్రతాప్’తో విజయం రావడం ఆనందంగా ఉంది. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రాజెక్ట్ ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మే 15న అందరూ థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

పెళ్లి గురించి స్పందిస్తూ.. "నాకు నిజంగానే తెలుగు అబ్బాయి కావాలి" అని పాయల్ రాధాకృష్ణ అంది. దానికి స్టేజ్ మీద ఉన్న వాళ్లు నవ్వడం, చప్పట్లు కొట్టారు. దాంతో పాయల్ రాధాకృష్ణ కూడా నవ్వింది.

అన్నీ ఇక్కడే ఉన్నాయి

"అంటే నేను నిజంగా పర్సనల్‌గా చెబుతున్నా. నాకు వర్క్ ఇచ్చింది, గుర్తింపు ఇచ్చింది, ఫేస్ వాల్యూ ఇచ్చింది, డబ్బులిచ్చింది, ప్లేస్ ఇచ్చింది అన్నీ హైదరాబాద్.. తెలుగు.. తెలుగు ఆడియెన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి నాకు. లైఫ్‌లో చేసింది అన్ని ఇక్కడే ఉన్నాయి. కాబట్టి నేను హైదరాబాద్‌ను, తెలుగు వాళ్లను విడిచిపెట్టే ఆలోచనే లేదు" అని పాయల్ రాధాకృష్ణ చెప్పింది.

"ఇక మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా గురించి వస్తే.. నా కెరీర్ స్టార్టింగ్‌లోనే ఈ సినిమాకు సైన్ చేశాను. అప్పుడు నా దగ్గర ఏ మూవీ లేదు. ముందు ఏ ప్రాజెక్ట్ చేయలేదు. అయినా ఆడిషన్ లేదు, ఏం లేదు, స్క్రిప్ట్ చెప్పారు, ఫోటోస్ చూశారు. పిలిచి ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. థ్యాంక్యూ సో మచ్ సర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు" అని పాయల్ రాధాకృష్ణ తెలిపింది.

3, 4 రోజులుగా వైరల్

ఇలా తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని, తెలుగు కోడలిగా సెటిల్ అవ్వాలన్న అర్థంలో పాయల్ రాధాకృష్ణ చేసిన కామెంట్స్ గత 3, 4 రోజులుగా వైరల్ అవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నెటిజన్స్ పలువిధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

కన్నడ బ్యూటీలంతా తెలుగింటి కోడళ్లైపోతున్నారు అంటూ నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే రౌడీ హీరో విజయ్ దేవరకొండను కన్నడ భామ రష్మిక మందన్నా పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలు అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో రష్మికలా ఆమె దారిలోనే కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ తెలుగు వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనుకుంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More