Vijay Rashmika: నా వాడి పుట్టినరోజు, విజయ్ దేవరకొండకు రివర్స్ ఆర్డర్‌‌లో రష్మిక మందన్నా క్యూట్ బర్త్ డే విషెస్- ఫొటోలు!

Vijay Deverakonda Birthday Rashmika Mandanna Wishes: విజయ్ దేవరకొండ 37వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. పెళ్లయ్యాక విజయ్ జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు కావడంతో రష్మిక మందన్నా స్పెషల్‌గా విష్ చేసింది. రివర్స్ ఆర్డర్‌లో విజయ్‌కు రష్మిక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

Published on: May 10, 2026, 09:16:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vijay Deverakonda Birthday Rashmika Mandanna Wishes: టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల సందడి సోషల్ మీడియాలో మరోసారి పీక్స్‌కు చేరింది. మే 9న విజయ్ దేవరకొండ తన 37వ పుట్టినరోజును జరుపుకున్నారు. అయితే, ఈసారి సెలబ్రేషన్స్ చాలా ప్రత్యేకంగా మారాయి.

నా వాడి పుట్టినరోజు, విజయ్ దేవరకొండకు రివర్స్ ఆర్డర్‌‌లో రష్మిక మందన్నా క్యూట్ బర్త్ డే విషెస్- ఫొటోలు!
నా వాడి పుట్టినరోజు, విజయ్ దేవరకొండకు రివర్స్ ఆర్డర్‌‌లో రష్మిక మందన్నా క్యూట్ బర్త్ డే విషెస్- ఫొటోలు!

ఎందుకంటే, రష్మిక మందన్నాతో వివాహం తర్వాత విజయ్ దేవరకొండకు వచ్చిన తొలి బర్త్‌డే ఇది. ఈ సందర్భంగా రష్మిక మందన్నా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భర్త విజయ్ దేవరకొండ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఆసక్తికరమైన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.

విజయ్‌తో రష్మిక 'పర్ఫెక్ట్ డే'

పుట్టినరోజు నాడు విజయ్‌తో గడిపిన క్షణాలను రష్మిక 'రివర్స్ ఆర్డర్'లో వివరించింది. జిమ్ సెల్ఫీలు, కారులో ఏకాంతంగా గడిపిన సమయం, కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలు ఇలా ప్రతిదీ అభిమానులతో పంచుకుంది.

"ఈరోజు నా వాడి (మై మ్యాన్ బర్త్ డే) పుట్టినరోజు.. రోజంతా ఇలా గడిచిపోయింది" అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది రష్మిక మందన్నా. ఉదయాన్నే వర్కౌట్స్, ఆ తర్వాత మీటింగ్స్, సాయంత్రం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లడం.. ఇలా రోజంతా విజయ్‌తో కలిసి బిజీగా గడిపినట్లు రష్మిక మందన్నా పేర్కొంది.

నిజానికి ఆరోజు రష్మిక షూటింగ్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ అనుకోకుండా షూటింగ్ క్యాన్సిల్ అవ్వడంతో విజయ్‌తో గడిపే సమయం దొరికిందని, ఆ విషయంలో తాను చాలా సంతోషంగా ఉన్నానని రష్మిక వెల్లడించింది. "హ్యాపీయెస్ట్ బర్త్‌డే మై విజ్జూ" అంటూ తన భర్తను ప్రేమగా విష్ చేసింది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.

అభిమానుల కోలాహలం.. పండగలా వేడుకలు

హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ నివాసం వద్ద అభిమానుల సందడి నెలకొంది. భారీ సంఖ్యలో తరలివచ్చిన ఫ్యాన్స్‌ను పలకరించేందుకు విజయ్ తన బాల్కనీలోకి వచ్చారు. విజయ్‌తో పాటు రష్మిక, విజయ్ తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి దేవరకొండ, రష్మిక సోదరి షిమాన్ కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు.

అభిమానుల కేరింతల మధ్య విజయ్ దేవరకొండ కేక్ కట్ చేసి అందరికీ అభివాదం చేశారు. ముఖ్యంగా విజయ్ నెక్ట్స్ సినిమా 'రణబాలి' థీమ్‌తో ఉన్న ఆ కేక్ అందరినీ ఆకట్టుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

సినిమాలతో బిజీగా

ఆ తర్వాత టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో ఘనమైన రిసెప్షన్ కూడా ఇచ్చారు విరోష్ జంట. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో 'రౌడీ జనార్దన' అనే సినిమాలో నటిస్తున్నారు. దీనితో పాటు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో భార్య రష్మిక మందన్నాతో కలిసి 'రణబాలి' అనే పీరియాడిక్ యాక్షన్ చిత్రంలోనూ నటిస్తున్నారు.

మరోవైపు రష్మిక మందన్నా కూడా బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ సరసన 'కాక్‌టెయిల్-2'తో పాటు తెలుగులో 'మైసా' వంటి చిత్రాలతో బిజీగా ఉంది. కెరీర్ పరంగా ఎవరికి వారు దూసుకుపోతున్నా, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఈ జంట ఒకరికొకరు తోడుగా ఉంటూ అందరినీ అలరిస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల వివాహం ఎప్పుడు జరిగింది?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా 2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకున్నారు.

2. విజయ్ దేవరకొండ తదుపరి సినిమాలు ఏమిటి?

విజయ్ ప్రస్తుతం రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్దన’, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'రణబాలి' అనే సినిమాల్లో నటిస్తున్నారు.

3. విజయ్ బర్త్‌డే వేడుకల్లో రష్మిక షేర్ చేసిన ఫోటోల విశేషమేమిటి?

పెళ్లయ్యాక విజయ్ జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు కావడంతో, రోజంతా ఆయనతో కలిసి చేసిన వర్కౌట్స్, ఫ్యామిలీ మీటింగ్స్, రణబాలి థీమ్ కేక్ కటింగ్ ఫోటోలను రష్మిక షేర్ చేశారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More