Rashmika Simran: చెల్లెలి పుట్టినరోజు, రెండో అమ్మలా రష్మిక మందన్నా- సెలబ్రిటీ లైఫ్‌లోని చేదు నిజం చెప్పిన హీరోయిన్!

Rashmika Mandanna On Simran Birthday: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన సోదరి సిమ్రాన్ 13వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోదరిపై తనకున్న ప్రేమను పంచుకుంటూనే, కెరీర్ బిజీలో ఆమె ఎదుగుదలను చూడలేకపోతున్నానంటూ రష్మిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Published on: May 4, 2026, 06:19:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rashmika Mandanna Post On Simran Birthday: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇంట పుట్టినరోజు వేడుకలు సందడి చేశాయి. రష్మిక మందన్నా చిన్న చెల్లెలు సిమ్రాన్ తన 13వ ఏట అడుగుపెట్టింది. టీనేజ్‌లోకి ప్రవేశించిన చెల్లెలి కోసం రష్మిక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక క్యూట్ పోస్ట్ షేర్ చేశారు. ముత్యాలు పొదిగిన వైట్ డ్రెస్సులో ఉన్న సిమ్రాన్ ఫోటోలు, కేక్ కట్ చేస్తున్న దృశ్యాలను అభిమానులతో పంచుకున్నారు.

చెల్లెలి పుట్టినరోజు, రెండో అమ్మలా రష్మిక మందన్నా- సెలబ్రిటీ లైఫ్‌లోని చేదు నిజం చెప్పిన హీరోయిన్!
చెల్లెలి పుట్టినరోజు, రెండో అమ్మలా రష్మిక మందన్నా- సెలబ్రిటీ లైఫ్‌లోని చేదు నిజం చెప్పిన హీరోయిన్!

రెండో అమ్మగా మారిన రష్మిక

"13 ఏళ్లు రావడం చాలా సరదాగా ఉంటుంది.. ఈ వయసును బాగా ఎంజాయ్ చెయ్. నీకు పెద్ద హగ్గులు" అంటూ రష్మిక మందన్నా తన చిన్ని సోదరిపై ప్రేమను కురిపిస్తూ ఈ ఏజ్‌ను ఎంజాయ్ చేయమని సలహా ఇచ్చారు. రష్మిక తన సోదరి కంటే 16 ఏళ్లు పెద్దది. సిమ్రాన్ పుట్టినప్పుడు రష్మిక మందన్నా ఒక అక్కలా కాకుండా రెండో అమ్మలా ఆమె బాగోగులు చూసుకునేవారు.

సినీ కెరీర్ మొదలుపెట్టాకే

చిన్నప్పుడు సిమ్రాన్‌కు స్నానం చేయించడం, డైపర్లు మార్చడం దగ్గరనుంచి అన్నీ తానై చూసుకున్నానని రష్మిక మందన్నా గతంలో పలు ఇంటర్వ్యూలలో గుర్తుచేసుకున్నారు. 2016లో 'కిరిక్ పార్టీ' సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన రష్మిక, అప్పటినుంచి షూటింగ్‌ల కోసమే ఎక్కువ సమయం కేటాయించడంతో ఇంటికి దూరంగా ఉండేవారట.

ఎదిగిపోతున్న చెల్లెలు.. మదిలో చిన్న బాధ

కెరీర్ పరంగా రష్మిక మందన్నా స్టార్ హీరోయిన్ రేంజ్‌ను ఎంజాయ్ చేస్తున్నా వ్యక్తిగత జీవితంలో ఒక తీరని వెలితి ఆమెను వెంటాడుతోందట. "నా చెల్లెలు పుట్టినప్పటి నుంచి ఆమె ఎదుగుదలను దగ్గరుండి చూడలేకపోయాను. ఆమె ఇప్పుడు దాదాపు నా ఎత్తుకు వచ్చేసింది. గత ఎనిమిదేళ్లుగా పనిలో పడి ఇంటికి వెళ్లడం కూడా తగ్గించేశాను. ఏడాదిన్నరగా అసలు ఇంటి మొహం కూడా చూడలేదు. నా స్నేహితులు కూడా నన్ను పక్కన పెట్టేస్తున్నారు. ఇది సెలబ్రిటీ లైఫ్‌లోని చేదు నిజం" అంటూ హీరోయిన్ రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు.

విజయ్ దేవరకొండతో పెళ్లి.. కెరీర్ జోరు

వృత్తిరీత్యా రష్మికకు 2025 చాలా కలిసొచ్చింది. 'కుబేర', 'థామా', 'ది గర్ల్‌ఫ్రెండ్' వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రష్మిక మందన్నా ఈ ఏడాది ఫిబ్రవరిలో తన సహ నటుడు, లవర్ విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'రణబాలి' చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు 'కాక్‌టెయిల్ 2', 'మైసా' వంటి క్రేజీ ప్రాజెక్టులు రష్మిక మందన్నా చేతిలో ఉన్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. రష్మిక మందన్న సోదరి పేరేంటి?

రష్మిక మందన్న చిన్న సోదరి పేరు సిమ్రాన్. ఆమె వయసు ఇప్పుడు 13 ఏళ్లు.

2. రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి ఎప్పుడు జరిగింది?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 2026 ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. అంతకుముందు వారు 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాల్లో కలిసి నటించారు.

3. రష్మిక తదుపరి సినిమాలు ఏవి?

రష్మిక ప్రస్తుతం 'రణబాలి', 'కాక్‌టెయిల్ 2', 'మైసా' వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More