Rashmika Birthday: పెళ్లి తర్వాత రష్మిక మందన్నా తొలి బర్త్ డే- ఖరీదైన బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన తండ్రి- దాని పేరు ఇదే!
Father Birthday Gift To Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా 30వ వసంతంలోకి అడుగు పెట్టింది. పెళ్లి తర్వాత రష్మిక మందన్నా జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు ఇది. ఈ సందర్భంగా రష్మిక మందన్నా తండ్రి తనకు ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఆ గిఫ్ట్ ఏంటో తెలుసుకుందాం.
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ఇంట ఇప్పుడు పండగ వాతావరణం నెలకొంది. ఏప్రిల్ 5న రష్మిక మందన్నా తన 30వ పుట్టినరోజును ఎంతో వైభవంగా జరుపుకున్నారు. ఇటీవలె వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రష్మిక మందన్నాకు పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు ఇది. దీంతో ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా ప్లాన్ చేశారు.

కొడగు సంప్రదాయంలో వేడుకలు
రష్మిక స్వస్థలమైన కూర్గ్ (కొడగు)లో జరిగిన ఆమె బర్త్ డే వేడుకల్లో ఇరు కుటుంబ సభ్యులు సందడి చేశారు. పుట్టినరోజు సందర్భంగా రష్మిక తన భర్త విజయ్‌తో కలిసి పాడి శ్రీ ఇగ్గుతప్ప ఆలయాన్ని సందర్శించారు. కొడవ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న రష్మిక ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తండ్రి ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ 'సెరినిటీ'
కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, తమ గ్రామంలోని ప్రజలకు అన్నదానం చేయడం, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ప్రకటించడం ద్వారా ఈ జంట తమ ఉదారతను చాటుకుంది. ఇక ఈ పుట్టినరోజు వేడుకల్లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం రష్మిక మందన్నా తండ్రి మదన్ తనకు ఇచ్చిన బహుమతి.
విరాజ్‌పేట సమీపంలోని ఒక ఖరీదైన విల్లాను రష్మికకు ఆమె తండ్రి కానుకగా ఇచ్చారు. ఈ విల్లాకు 'సెరెనిటీ' (ప్రశాంతత) అని పేరు పెట్టడం విశేషం. ఈ విషయాన్ని ప్రకటిస్తున్న సమయంలో రష్మిక మందన్నా తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు. పెళ్లి తర్వాత కూతురికి ఒక శాశ్వతమైన జ్ఞాపకాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పెళ్లి నుంచి బర్త్‌డే వరకు.. అన్నీ స్పెషలే!
గత ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య విజయ్, రష్మికల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు. ఇక ఇప్పుడు 30వ ఏట అడుగుపెట్టిన రష్మికకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా వెల్లువలా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె వ్యక్తిగత జీవితంలోనే కాకుండా వృత్తిపరంగా కూడా అద్భుతమైన ఫేజ్‌లో ఉంది.
క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా రష్మిక
కేవలం వ్యక్తిగత విషయాలే కాదు, రష్మిక కెరీర్ కూడా ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. గతంలో విజయ్‌తో కలిసి 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న రష్మిక మందన్నా త్వరలో రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'రణబాలి' అనే చిత్రంలో మళ్లీ విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది.
హిందీలోనూ రష్మిక హవా కొనసాగుతోంది. షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'కాక్ టెయిల్-2' లో రష్మిక కీలక పాత్ర పోషిస్తోంది. హోమీ అదజానియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్ 19, 2026న విడుదల కానుంది. ఆధునిక సంబంధాలు, ప్రేమకథా నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాపై బాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


