Sign in

వెంకటేశ్, త్రివిక్రమ్ సినిమాలో ఆ కన్నడ బ్యూటీ.. బర్త్‌డే విషెస్ చెబుతూ మేకర్స్ పోస్ట్

వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో మరో కన్నడ అందాన్ని ఫిమేల్ లీడ్ గా తీసుకున్నారు. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టికి బర్త్ డే విషెస్ చెబుతూ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు.

Published on: Oct 21, 2025, 20:30:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ లో మరో మూవీ వస్తున్న విషయం తెలుసు కదా. ఈ సినిమాను ఈ మధ్యే అధికారికంగా అనౌన్స్ చేశారు. వెంకీ తన కెరీర్లో నటిస్తున్న 77వ సినిమా ఇది. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వెంకటేశ్ నటిస్తున్న మూవీ. ఇందులో ఫిమేల్ లీడ్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

వెంకటేశ్, త్రివిక్రమ్ సినిమాలో ఆ కన్నడ బ్యూటీ.. బర్త్‌డే విషెస్ చెబుతూ మేకర్స్ పోస్ట్
వెంకటేశ్, త్రివిక్రమ్ సినిమాలో ఆ కన్నడ బ్యూటీ.. బర్త్‌డే విషెస్ చెబుతూ మేకర్స్ పోస్ట్

వెంకీ సరసన శ్రీనిధి శెట్టి

కన్నడ అందం, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి మరో తెలుగు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అది కూడా వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడం విశేషం. మంగళవారం (అక్టోబర్ 21) ఆమె తన పుట్టిన రోజు జరుపుకుంది. ఆమెకు విషెస్ చెబుతూ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. కొన్ని రోజులుగా శ్రీనిధే ఈ మూవీలో ఫిమేల్ లీడ్ అని వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు మేకర్స్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా దానిని కన్ఫమ్ చేసింది. “గార్జియస్, గ్రేషియస్ శ్రీనిధి శెట్టికి బర్త్ డే విషెస్.. హ్యాపీ బర్త్ డే శ్రీనిధి శెట్టి.. ప్రొడక్షన్ నం.8లో మిమ్మల్ని తీసుకోవడం ఎక్సైటింగా ఉంది..” అనే క్యాప్షన్ తో పోస్ట్ చేశారు.

శ్రీనిధి శెట్టి వరుస తెలుగు సినిమాలు

శ్రీనిధి శెట్టి మొదట కేజీఎఫ్ ఛాప్టర్ 1 సినిమాలో పాపులర్ అయింది. ఆ సినిమా ద్వారా ఆమె దేశమంతా తెలిసిన పేరు అయింది. అయితే ఆ రెండు మూవీస్ హిట్ అయినా.. కన్నడలో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ ఈ మధ్య తెలుగులో వరుసగా అవకాశాలు సొంతం చేసుకుంది. నానితో హిట్ 3 మూవీలో నటించిన ఆమె.. ఈ మధ్యే తెలుసు కదాలోనూ కనిపించింది. ఇక ఇప్పుడు వెంకటేశ్, త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

ఈ సినిమాను సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. హారిక అండ్ హాసిని బ్యానర్లో మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకు యానిమల్ ఫేమ్ హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం త్వరలోనే రానుంది. అయితే వెంకీ, త్రివిక్రమ్ కాంబినేషనే ఈ సినిమాపై ఎక్కడ లేని అంచనాలను పెంచేస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More