ఏపీ విద్యార్థులకు శుభవార్త - రూ. 1200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పూర్తిగా విడుదల చేసింది. రూ. 1,200 కోట్ల బకాయిలు విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసింది. రూ. 1200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేస్తూ… ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా ప్రకటన చేశారు.

రాష్ట్రంలోని చాలా మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ బకాయిలు భారీగా పేరుకుపోవటంతో… కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. పరీక్షల సమయంలో హాల్ టికెట్ల జారీ చేసేటప్పుడు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అంతేకాకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు కోర్సు పూర్తైన తర్వాత కూడా సర్టిఫికేట్లు కూడా అందించడం లేదు. ఫీజు బకాయిలను చెల్లిస్తేనే సర్టిఫికెట్లను ఇస్తామని తేల్చి చెబుతున్నాయి.
విద్యార్థుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం… గత కొంత కాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఫోకస్ పెడుతూ వస్తోంది. అయితే ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేస్తోంది. తాజాగా రూ.1200 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం ఆర్థికశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను పూర్తిగా క్లియర్ చేసేనట్లు అయింది.
ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్న వివరాల ప్రకారం…. బీసీ కార్పొరేషన్ల ద్వారా రూ.736.01 కోట్లు, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రూ.98.92 కోట్లు, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ద్వారా రూ.365.07 కోట్లు విడుదల చేశారు. మొత్తం కలిపి రూ.1200 కోట్ల బకాయిలను క్లియర్ చేశారు. ఈ నిధులు నేరుగా కళాశాలల ఖాతాల్లోనే జమవుతాయి. పెండింగ్ బకాయిలను విడుదల చేయటంపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

