ప్రసవాల మధ్య సరైన కాల వ్యవధి పాటించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, కుటుంబ నియంత్రణ సేవలను మరింత చేరువ చేసేందుకు జూలై 11 నుండి 18 వరకు రాష్ట్రవ్యాప్త అవగాహన వారోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. ఒక ప్రకటనలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

వరుస గర్భధారణల మధ్య కనీసం రెండేళ్ల వ్యవధిని నిర్వహించడం వల్ల తల్లీ, పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. ఈ కనీస గ్యాప్ వల్ల మాతృ మరణాలను 30 శాతం వరకు, అలాగే శిశు మరణాలను 10 శాతం వరకు తగ్గించవచ్చని మంత్రి స్పష్టం చేశారు. మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలనే ఉద్దేశంతోనే ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రచారంలో భాగంగా ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నగదు బహుమతులను ప్రకటించింది. మూడు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న జంటలు ప్రతి జిల్లా నుండి ముగ్గురు దంపతులను ఎంపిక చేస్తారు. ఒక్కో జంటకు రూ. 5,000 చొప్పున ప్రోత్సాహకం అందిస్తారు.
అంతేకాదు ప్రసవాల మధ్య రెండేళ్ల వ్యవధి పాటించిన జంటలను కూడా సెలక్ట్ చేస్తారు. ప్రతి జిల్లా నుండి మరో ముగ్గురు దంపతులను ఎంపిక చేసి, వారికి కూడా రూ. 5,000 చొప్పున నగదు బహుమతి ఇస్తారు. రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాల నుండి జిల్లాకు ఆరుగురు చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఒకవేళ అర్హులైన దరఖాస్తుదారుల సంఖ్య కోటా కంటే ఎక్కువగా ఉంటే.. లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేస్తారు.
ఈ అవగాహన ప్రచార కార్యక్రమాల కోసం ఆరోగ్య శాఖ రూ. 56 లక్షల నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు రూ.2 లక్షల చొప్పున కేటాయించారు. ఈ క్యాంపెయిన్ ద్వారా ఆధునిక కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు ముఖ్యంగా టీనేజ్ గర్భధారణలు(బాల్య వివాహాల వల్ల వచ్చే గర్భాలు) ఎక్కువగా నమోదవుతున్న మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అలాగే ఈ ప్రచారంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి కూడా నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
{{/usCountry}}ఈ అవగాహన ప్రచార కార్యక్రమాల కోసం ఆరోగ్య శాఖ రూ. 56 లక్షల నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు రూ.2 లక్షల చొప్పున కేటాయించారు. ఈ క్యాంపెయిన్ ద్వారా ఆధునిక కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు ముఖ్యంగా టీనేజ్ గర్భధారణలు(బాల్య వివాహాల వల్ల వచ్చే గర్భాలు) ఎక్కువగా నమోదవుతున్న మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అలాగే ఈ ప్రచారంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి కూడా నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
{{/usCountry}}