Ashadam: ఆషాఢ మాసం అంటే అశుభమా? ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం దూరమవుతుందా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!
2026లో ఆషాఢ మాసం జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు ఉంటుంది. ఈ నెలలో తొలి ఏకాదశి, గురుపూర్ణిమ, ఆషాఢ అమావాస్య వంటి ముఖ్యమైన పర్వదినాలు వస్తాయి. ఆషాఢ మాసంలో పరిశుభ్రత, దానధర్మాలు, భక్తి, నియమ నిష్ఠలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి.
ప్రస్తుతం జ్యేష్ఠ మాసం నడుస్తోంది. ఈ నెల పూర్తయిపోయిన తర్వాత ఆషాఢ మాసం మొదలవుతుంది. ఆషాఢ మాసం 2026 జూలై 15న మొదలై, ఆగస్టు 12తో ముగుస్తుంది. ఈ నెలలో తొలి ఏకాదశి, గురు పూర్ణిమ, ఆషాఢ అమావాస్యతో పాటు మరికొన్ని ముఖ్యమైన రోజులు వస్తాయి.

ఆషాఢ మాసంలో చాలా పద్ధతులను పాటిస్తూ ఉంటాము. ఆషాఢ మాసంలో ఏ రోజు అత్యంత పవిత్రమైనది? ఆషాఢ మాసంలో మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి? ఆషాఢ మాసంలో దరిద్రం కలగకుండా ఉండాలంటే ఎలాంటి తప్పులు చేయకూడదు? ఆషాఢ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఎటువంటి పొరపాట్లు చేయకూడదు? వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం.
ఆషాఢ మాసంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. లక్ష్మీదేవికి కోపం వస్తుంది
ఆషాఢ మాసం జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కొన్ని తప్పులు చేయకూడదు. ఆషాఢ మాసంలో పరిశుభ్రత, దానధర్మాలు, భక్తి, నియమ నిష్ఠలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. శుభ్రత, సాత్విక జీవనం లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కనుక ఇంటిని అపరిశుభ్రంగా ఉంచడం, ఆహారాన్ని వృథా చేయడం, పెద్దలను అవమానించడం, దానాలు చేయకపోవడం లాంటి తప్పులు చేయకండి. లేదంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు.
- ఇంటిని పొరపాటున కూడా మురికిగా ఉంచకండి.
- సూర్యోదయం తర్వాత ఎక్కువసేపు నిద్రపోవడం, ఆహారాన్ని వృథా చేయడం మంచిది కాదు.
- లక్ష్మీదేవికి కోపం వస్తే ఇంట్లో ఐశ్వర్యం తగ్గిపోతుందని గుర్తుపెట్టుకోండి.
ఆషాఢ మాసంలో ఇంట్లో ఈ వస్తువులు ఉండకూడదు.. ప్రతికూల శక్తి పెరుగుతుంది
వాస్తు ప్రకారం పొరపాటున కూడా ఈ వస్తువులను ఇంట్లో ఉంచకూడదు. ఆషాఢ మాసంలో కూడా ఈ వస్తువులను ఇంట్లో ఉంచడం మంచిది కాదు.
పగిలిన అద్దాలు, పాడైపోయిన గడియారాలు, ఎండిపోయిన పూలు, పూలమాలలు, విరిగిపోయిన దేవతా విగ్రహాలు, పనికిరాని ఎలక్ట్రానిక్ సామాన్లు, చిరిగిపోయిన వస్తువులు వుండకూడదు. వీటి వలన ప్రతికూల శక్తి ఏర్పడుతుందని చెబుతారు. దరిద్రం కలుగుతుందని నమ్ముతారు. కాబట్టి వీటిని ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు. ఆషాఢ మాసంలో అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి.
ఆషాఢ మాసంలో పవిత్రమైన రోజులు
ఆషాఢ మాసంలో గురు పూర్ణిమకు ప్రత్యేక స్థానం ఉంది. 2026లో గురుపూర్ణిమ జూలై 29న వస్తుంది. ఆ రోజు వ్యాస మహర్షిని స్మరించి గురువులను పూజిస్తారు.
గురుపూర్ణిమ విశిష్టత:
- ఆధ్యాత్మిక సాధనకు శుభప్రదం.
- జ్ఞానానికి ప్రతీక.
- గురుభక్తిని పెంచుతుంది.
- దాన, జప, పారాయణాలకు ఇది ఉత్తమమైన రోజు.
- దేవశయిని ఏకాదశిని కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆ రోజు నుంచి చాతుర్మాస వ్రతాలు మొదలవుతాయి.
ఆషాఢ మాసంలో మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి
ఆషాఢ మాసంలో మహిళలు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం వలన మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఆరాధిస్తే విశేషమైన ఫలితాలను పొందవచ్చు. అలాగే తులసి పూజ కూడా చేసుకుంటే మంచిది.
పేద మహిళలకు పసుపు, కుంకుమలను దానం చేస్తే విశేషమైన ఫలితాలను పొందవచ్చు. సుమంగళులకు తాంబూలం ఇస్తే కూడా మంచి జరుగుతుందని చెబుతారు. కుటుంబ శ్రేయస్సు కోసం ప్రతిరోజూ దీపారాధన చేయాలి.
అలాగే ఆషాఢ మాసంలో మంచి ఆలోచనలు, మంచి పనులు, దేవుని స్మరణ శుభ ఫలితాలను ఇస్తాయి. ఆషాఢ మాసం అశుభం కాదని గుర్తుపెట్టుకోండి. ఇది భక్తి, దానం, ఆత్మపరిశీలనకు అత్యంత పవిత్రమైన మాసం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


