Business Success Numerology: ఈ తేదీల్లో పుట్టిన మహిళలు బిజినెస్‌లో టాప్.. నాయకత్వం, ధైర్యం, సంపద యోగం ఎక్కువ!
పుట్టిన తేదీ మన వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు, వ్యాపార దక్షతపై ప్రభావం చూపుతుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా మూలాంకం 1, 3, 5, 8 కలిగిన వారు వ్యాపార రంగంలో వేగంగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని న్యూమరాలజీ నిపుణులు పేర్కొంటున్నారు.
రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు చెప్పవచ్చు. అలాగే న్యూమరాలజీ ద్వారా కూడా అనేక విషయాలను తెలుసుకోవచ్చు.

వ్యాపారంలో రాణించాలంటే నైపుణ్యం ఒకటే చాలదు. సరైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, ధైర్యంగా కఠిన శ్రమతో ముందుకు వెళ్లాలి. కొంత మంది పుట్టుకతోనే వ్యాపారవేత్తలుగా ఉంటారని అంటారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు వ్యాపార రంగంలో దూసుకుపోతారు. మరి మీరు ఈ తేదీల్లో పుట్టారేమో చూసుకోండి.
పుట్టిన తేదీ వ్యాపార భవిష్యత్తును నిర్ణయిస్తుందా?
సక్సెస్ అనేది ఒక ప్రయాణం అని చెప్పొచ్చు. కొంతమంది మహిళలు వ్యాపార రంగంలో అద్భుతాలను సృష్టిస్తారు. వారి ఆలోచనలతో వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఈ తేదీల్లో పుట్టిన మహిళలు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. సృజనాత్మకత, వ్యాపార దక్షతను కలిగి ఉంటారు. ఈ లక్షణాలు వారిని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా నిలబెడుతున్నాయి. మరి మీరు కూడా గొప్ప వ్యాపారవేత్త కాదో తెలుసుకోండి.
మూలాంకం 1
ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి మూలాంకం 1 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన మహిళలపై సూర్యుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో మీరు స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. ఏ విషయంలోనూ రాజీపడరు. రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. నిర్ణయాత్మక శక్తి మీ అదనపు బలం. మీరు వ్యాపారాన్ని ముందుకు నడిపించడంలో, ఉద్యోగులను సరైన దిశలో నడిపించడంలో దిట్ట.
మూలాంకం 5
ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే వీరి మూలాంకం 5 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మార్కెట్ పరిస్థితులను బాగా అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార ప్రపంచంలో వస్తున్న మార్పులను ముందుగానే పసిగడతారు. మీ మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కస్టమర్లను, భాగస్వాములను కూడా ఆకట్టుకోగలరు.
మూలాంకం 8
ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే వారి మూలాంకం 8 అవుతుంది. శని దేవుని ఆశీస్సులు వీరిపై ఎప్పుడూ ఉంటాయి. క్రమశిక్షణ, సహనంతో ఉంటారు. జీరో నుంచి వ్యాపారాన్ని మొదలుపెట్టి, నెక్స్ట్ లెవెల్‌కు తీసుకు వెళ్లే శక్తి వీరికి ఉంటుంది. డబ్బు నిర్వహణలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. అలాగే దీర్ఘకాలిక ప్రణాళికలు వేయడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయరు.
ఈ తేదీల్లో పుట్టిన వారికి గురువు ఆశీస్సులు ఉంటాయి
ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినట్లయితే గురు గ్రహం ఆధీనంలో ఉంటారు. జ్ఞానం, అభివృద్ధికి ప్రతీకలుగా నిలుస్తారు. అద్భుతమైన మేనేజ్‌మెంట్ స్కిల్స్ వీరి సొంతం. ఒక టీమ్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఈ తేదీల్లో పుట్టిన వారికి బాగా తెలుసు. వ్యాపారాన్ని విస్తరించడంలో మీరు చూపే చొరవ అసాధారణం.
కృషి, పట్టుదల ముఖ్యమే
సంఖ్యాశాస్త్రం అనేది వ్యక్తికి గైడ్‌లైన్ మాత్రమే. విజయం అనేది కష్టపడటం వల్ల వస్తుంది. కృషి, పట్టుదల తోడైతే కచ్చితంగా వ్యాపారంలో బాగా రాణించొచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


