జూన్ 8, 9 తేదీల్లో ఆకాశంలో అద్భుతమైన దృశ్యం.. భూమికి దగ్గరగా గురుడు, శుక్రుడు.. ఎక్కడ, ఎలా చూడాలి?

ఆకాశంలో అద్భుతమైన దృశ్యం కనిపించనుంది. జూన్ 8, 9 తేదీల్లో శుక్రుడు, గురుడు భూమి నుంచి చూస్తే అత్యంత సమీపంలో కనిపించనున్నాయి.

Published on: Jun 7, 2026, 16:11:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఖగోళ ప్రియులకు ప్రకృతి అద్భుతమైన కానుకను అందించబోతోంది. అనంత విశ్వంలో మరో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. సౌర కుటుంబంలోనే అత్యంత ప్రకాశవంతమైన రెండు గ్రహాలు పక్కపక్కనే దర్శనమివ్వబోతున్నాయి. ఈ అద్భుత గ్రహ సంగమాన్నే ఖగోళ పరిశోధకులు, జ్యోతిష్య నిపుణులు ‘కాస్మిక్ కిస్’ అని పిలుస్తున్నారు. జూన్ 8, 9 తేదీల్లో ఈ అరుదైన ఖగోళ వింతను మన దేశం నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వీక్షించే అవకాశం లభించనుంది.

కాస్మిక్ కిస్
కాస్మిక్ కిస్

శాస్త్రీయ పరిభాషలో చెప్పాలంటే.. ఆకాశంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రేఖపైకి వచ్చి, అత్యంత సమీపంలో కనిపించడాన్ని ‘ప్లానెటరీ కంజంక్షన్’ లేదా 'గ్రహ సంగమం' అని పిలుస్తారు. ప్రస్తుతం మనకు ఆకాశంలో అత్యంత కాంతివంతంగా మెరిసే గురు గ్రహం, శుక్ర గ్రహం ఒకే సరళరేఖపైకి రాబోతున్నాయి.

భూమి నుంచి చూసే దృక్కోణం వల్ల ఇవి కేవలం 2 డిగ్రీల అంతరంలో పక్కపక్కనే ఉన్నట్లు కనిపిస్తుంది. నిజానికి అంతరిక్షంలో ఈ రెండు గ్రహాల మధ్య కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. సూర్యుడి చుట్టూ ఇవి తిరిగే కక్ష్యలు, వాటి వేగంలో ఉండే తేడాల వల్లే ఇలాంటి అరుదైన దృశ్యాలు అప్పుడప్పుడు సంభవిస్తుంటాయి.

ప్రస్తుతం ఈ రెండు శక్తివంతమైన గ్రహాలు కర్కాటక రాశిలో సంచరిస్తూ, ఒకదానికొకటి అత్యంత చేరువగా వస్తున్నాయి. పురాతన కాలం నుండి పండితులు దీనిని విశేషంగా భావిస్తూ వస్తున్నారు. అందుకే దీనికి ‘కాస్మిక్ కిస్’ అనే పేరు పెట్టారు.

ఈ ఖగోళ వింతను చూడటానికి మీకేలాంటి ఖరీదైన టెలిస్కోప్‌లు లేదా బైనాక్యులర్లు అవసరం లేదు. మీ సాధారణ కళ్లతోనే ఈ అద్భుతాన్ని స్పష్టంగా చూడవచ్చు. జూన్ 8, 9 (సోమ, మంగళవారాలు) సూర్యాస్తమయం అయిన వెంటనే పశ్చిమ - వాయువ్య దిశలో ఈ గ్రహాలను చూడవచ్చు. కేవలం అర గంట నుండి ఒక గంట లోపు మాత్రమే ఈ అద్భుత దృశ్యం కనిపిస్తుంది. భూమి దగ్గరలో ఉన్నట్టుగా అగుపిస్తుంది.

వీక్షణ చిట్కాలు

సూర్యుడు అస్తమించిన వెంటనే పశ్చిమ దిశగా ఆకాశంలో చూస్తే.. మిగిలిన నక్షత్రాల కంటే అత్యంత ప్రకాశవంతంగా రెండు చుక్కలు పక్కపక్కనే మెరుస్తూ కనిపిస్తాయి. అవే గురు, శుక్ర గ్రహాలు.

ఇవి క్రమంగా హోరైజన్ (దిక్చక్రం) వైపునకు వెళ్తూ అస్తమిస్తాయి కాబట్టి, సూర్యాస్తమయం అయిన గంటలోపే దీనిని చూడాలి. ఆ తర్వాత ఇవి కనిపించవు.

ఈ అద్భుతాన్ని స్పష్టంగా ఆస్వాదించాలంటే నగరాల్లోని కృత్రిమ కాంతులు (లైట్లు) తక్కువగా ఉండేలా ఓపెన్ టెర్రస్ లేదా మైదాన ప్రాంతాలను ఎంచుకోవడం మంచిది. అలాగే ఆకాశంలో మబ్బులు లేకుండా నిర్మలంగా ఉండాలి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More