ఆ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ప్రమోషన్లు.. 815 పోస్టులకు ఆమోదం!

స్వర్ణ వార్డుల్లో పనిచేస్తున్న పలు కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు పదోన్నతులు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Published on: Sep 27, 2026, 21:18:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు సచివాలయాల్లోని నాలుగు కేటగిరీ విభాగాలకు చెందిన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ ప్రకారం వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న పలు కేటగిరీల ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు లభించనున్నాయి. అవి వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీలు - గ్రేడ్-II, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలు - గ్రేడ్-IIలకు పదోన్నతి రానుంది.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను పూర్తి చేయనుంది. 815 నూతన జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్తగా మంజూరైన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ద్వారా అర్హులైన వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు లభిస్తాయి. అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల ప్రమోషన్ల వల్ల ఖాళీ అయ్యే పోస్టుల్లోకి అర్హులైన వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి.

వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ విభాగాల్లో గ్రేడ్-II కేడర్ పోస్టులను గ్రేడ్-Iగా మారుతాయి. ప్రతి కేటగిరీలో 815 పోస్టుల చొప్పున రెండు విభాగాలలో కలిపి మొత్తం 1,630 పోస్టులను గ్రేడ్-I కేడర్‌కు అప్‌గ్రేడ్ అవుతాయి. దీని ద్వారా ఈ రెండు విభాగాల సిబ్బందికి నేరుగా గ్రేడ్-I హోదా, మెరుగైన వేతన శ్రేణి అందుబాటులోకి రానుంది.

ప్రభుత్వం పదోన్నతి క్రమానుగత శ్రేణిని నోటిఫై చేసినప్పటికీ.. 2019లో నియమితులైన వారిలో చాలా మంది ఆరేళ్లకు పైగా సర్వీసు పూర్తి చేసినా పదోన్నతి పొందకుండా ఇబ్బంది పడుతున్న దీర్ఘకాలిక సమస్యను ఈ నిర్ణయం పరిష్కరిస్తుంది. పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని స్వర్ణ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులకు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.

పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి (MAUD) ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ పునర్వ్యవస్థీకరణ పురపాలక పరిపాలనలో, ముఖ్యంగా పారిశుధ్యం, రెవెన్యూ పరిపాలన, పట్టణ ప్రణాళిక, డిజిటల్ సేవల పంపిణీలో పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుందని అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More