ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు ఖరారు చేయడం, మార్గనిర్దేశం చేసేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మెుత్తం 10 మంది మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మంత్రుల కమిటీలో సభ్యులు
ఏపీ ప్రభుత్వం
{{^htLoading}} {{/htLoading}}
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు అనిత, నారాయణ, అచ్చెన్నాయుడు, డీఎస్‌బీవీస్వామి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, గొట్టిపాటి రవికుమార్, సంధ్యారాణి సభ్యులుగా ఉంటారు. వీరందరూ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రమోషన్లపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ మంత్రుల సబ్ కమిటీ కన్వీనర్‌గా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల శాఖ ప్రభుత్వ కార్యదర్శి వ్యవహరిస్తారు. కమిటీ సమావేశాలను సమన్వయం చేస్తారు. ఈ మంత్రుల కమిటీ బాధ్యతలను నిర్వర్తించేందుకు అవసరమైతే ఏ ఇతర శాఖ నుండి అయినా లేదా ఏ నిపుణుడి నుండి అయినా సహాయం కోరవచ్చు.
కమిటీ విధివిధానాలు
మంత్రుల సబ్ కమిటీ వారి వారి శాఖలలో ప్రమోషన్లు ఇవ్వడానికి, మధ్యంతర పోస్టుల సృష్టిపై, వాటి విధానాలపై చర్చిస్తుంది. ఇతర శాఖలలో ప్రమోషన్లకు పరిధిని నిర్ణయిస్తుంది. వర్తించినట్లయితే మధ్యంతర పోస్టులకు పే స్కేల్‌పై నిర్ణయం తీసుకుంటుంది.
ప్రమోషన్లు ఖరారు చేయడం, మార్గనిర్దేశం చేయడం కోసం సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేస్తుంది. ప్రమోషన్ల తర్వాత, రేషనలైజేషన్ నియమాల ప్రకారం నిర్దేశించిన సంఖ్యలో ఫంక్షనరీలను నిర్వహించడానికి ఖాళీలను భర్తీ చేసే విధానాన్ని నిర్ణయం తీసుకుంటుంది. ప్రమోషన్ల తర్వాత ఖాళీలు భర్తీ చేసే పద్ధతిపైనా మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుంది. ఈ మంత్రుల సబ్ కమిటీ త్వరగా నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి తన సిఫార్సులను సమర్పించాలని ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.