ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయడానికి టీచర్లతో టీమ్స్.. మెుత్తం 299 కమిటీలు!

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయడానికి ఉపాధ్యాయ బృందాలు విద్యాశాఖ నియమించనుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Published on: Oct 13, 2025, 10:48:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బృందాలను నియమిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. విద్యా నాణ్యతను పెంచాలనే ఉద్దేశంతో పర్యవేక్షణ పెంచాలని భావిస్తోంది. పాఠశాల విద్య డైరెక్టర్ ఇ. నవీన్ నికోలస్ ప్రకారం, ప్రతి బృందం మూడు నెలలకు ఒకసారి 100 ప్రాథమిక పాఠశాలలు, 50 ఉన్నత పాఠశాలలను తనిఖీ చేస్తుంది. మూడు నెలల్లో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలి. ప్రతీ వారం డీఈఓలకు నివేదిక సమర్పించాలి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

జిల్లా విద్యా అధికారులు(డీఈఓ) తమ జిల్లాల్లోని పాఠశాలల సంఖ్య ఆధారంగా తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న మొత్తం ఉపాధ్యాయులలో రెండు శాతం మంది ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తారు. ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేసే బృందాలలో ఇద్దరు సభ్యులు, ఒక నోడల్ అధికారి ఉంటారు. ఉన్నత పాఠశాలలను తనిఖీ చేసే బృందాలలో గెజిట్ ప్రధానోపాధ్యాయుడుతో సహా తొమ్మిది మంది సభ్యులు ఉంటారు.

ఈ బృందాలు వారానికోసారి సంబంధిత డీఈఓలకు నివేదికను అందిస్తాయి. తనిఖీల నుండి వచ్చిన అన్ని ఫలితాలు, నివేదికలు శాఖ ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. అవసరమైన చోట వనరులను అందించడం ద్వారా బోధన-అభ్యాస ప్రక్రియను బలోపేతం చేయడానికి ఈ యంత్రాంగం ఉపయోగపడుతుంది. ఇన్స్పెక్టర్లు విద్యా సమస్యలు, విద్యా క్యాలెండర్ ప్రకారం సిలబస్ పూర్తి, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, శారీరక విద్య కార్యకలాపాలను తనిఖీ చేయాలి.

తెలంగాణలో 16,474 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వాటికి 168 కమిటీలు, 3100 ప్రాథమికోన్నత పాఠశాలలకు 35 కమిటీలు, 4672 ఉన్నత పాఠశాలలకు 96 కమిటీలను ఏర్పాటు చేస్తారు. టీచర్లను ఎంపిక చేసే కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని విదాశాఖ డీఈఓలకు ఆదేశాలు ఇచ్చింది.

గతంలోనే ప్రభుత్వం ఈ కమిటీలు నియమించేందుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. ఎందుకంటే.. అప్పుడు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఒకే కమిటీని నియమించాలనుకున్నారు. ఇందుకు స్కూల్ అసిస్టెంట్‌ను నోడల్ అధికారిగా నియమించిన విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు వచ్చాయి. సీనియర్లను జూనియర్లు ఎలా ప్రశ్నిస్తారని ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. దీంతో అప్పుడు ఈ నిర్ణయం వెనక్కు వెళ్లిపోయింది. అయితే తాజాగా వేర్వేరు కమిటీలను నియమిస్తుంది ప్రభుత్వం.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More