తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో అడ్మిషన్స్.. సీట్లు, అర్హతలు, ఎంపిక విధానం.. పూర్తి సమాచారం మీ కోసం
తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ స్కూల్స్ కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
విద్యార్థులను చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచి.. క్రీడలలో శిక్షణ అందించేందుకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ క్రీడా పాఠశాలలను నిర్వహిస్తోంది. అయితే ఇందులో అడ్మిషన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు టైమ్ వచ్చింది. తెలంగాణ క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతి ప్రవేశానికి సంబంధించిన ప్రవేశాల ప్రక్రియ షురూ అయింది. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఎంపిక ప్రక్రియ జరగనుంది.

సీట్ల వివరాలు
హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. హకీంపేట్ బాలురు-20 సీట్లు, బాలికలు-20 సీట్లు. కరీంనగర్ బాలురు-20 సీట్లు, బాలికలు-20 సీట్లు, ఆదిలాబాద్ బాలురు-20 సీట్లు, బాలికలు-20 సీట్లు ఉన్నాయి. అంటే మెుత్తం 120 సీట్లలో 60 బాలురకు, 60 బాలికలకు అన్నమాట.
ఎంపిక ప్రక్రియ
ఎంపిక ప్రక్రియ మూడు విధానాల్లో జరుగుతుందని గుర్తుంచుకోవాలి. 16-06-2025 నుంచి 19-06-2025 మధ్య మండల స్థాయి ఎంపిక జరుగుతుంది. 23-06-2025 నుంచి 26-06-2025 మధ్య జిల్లా స్థాయి సెలక్షన్ ఉంటుంది. 01-07-2025 నుంచి 05-07-2025 వరకు రాష్ట్ర స్థాయి ఎంపిక చేస్తారు. ఇందులో ఎంపికైన వారి మెరిట్ ఆధారంగా తీసుకుంటారు.
ఫిజకల్ పరీక్షలు(27 మార్కులు)
30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్స్, స్టాండింగ్ బాడీ జంప్, 800 మీటర్ల రన్, 6x10 మీటర్ల షటిల్ రన్, మెడిసిన్ బాల్ త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, ఎత్తు, బరువు. ఈ పరీక్షలు చేస్తారు. ఇందులో ప్రతీదానికి 3 మార్కులు ఉంటాయి. మెుత్తం కలిపితే 27 మార్కులు అవుతాయి.
మెడికల్ పరీక్షలు : వయసు ధృవీకరణ, పోస్టర్, బోన్ అబ్ నార్మలిటీస్ పరీక్షలు చేస్తారు.
పుట్టిన తేదీలు : 01-09-2016 నుంచి 31-08-2017 మధ్య జన్మించి ఉండాలి. అంటే 8 నుంచి 9 సంవత్సరాల వయసు.
ముఖ్యమైన వివరాలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 07-06-2025 నుంచి మెుదలు అవుతుంది. విద్యార్థులు www.tgss.telangana.gov.inలో వివరాలు నమోదు చేసుకోవచ్చు. పరీక్షలు నిర్వహించే ప్రదేశం, తేదీలు, ఇతర వివరాలకు సంబంధిత జిల్లా క్రీడా, యువజన శాఖ అధికారిని సంప్రదించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper



