ఏపీలో జూనియర్ డాక్టర్లకు గుడ్‌న్యూస్.. స్టైపెండ్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు!

ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. స్టైపెండ్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published on: Sep 21, 2026, 18:11:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో విధులు నిర్వహణ అందిస్తున్న జూనియర్ డాక్టర్లకు (జూడా) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్ పెంపు డిమాండ్‌పై సానుకూలంగా స్పందిస్తూ అధికారికంగా జీవో విడుదల చేసింది. పెరిగిన ఈ స్టైపెండ్ 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

జూనియర్ డాక్టర్లకు స్టైపెండ్ పెంపు
జూనియర్ డాక్టర్లకు స్టైపెండ్ పెంపు

ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం ఎంబీబీఎస్, బీడీఎస్ ఇంటర్న్‌షిప్ చేస్తున్న హౌస్ సర్జన్లకు 10 శాతం, పీజీ (PG) విద్యార్థులకు 5 శాతం, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు అభ్యసిస్తున్న వైద్య విద్యార్థులకు 3.5 శాతం చొప్పున స్టైపెండ్ పెరిగింది. ఈ పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ. 34.08 కోట్ల అదనపు భారం పడనుంది.

గత నెలలో జూనియర్ డాక్టర్లు తమ సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా స్టైపెండ్ పెంపు కోసం నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ప్రారంభంలో వైద్యులు తమ స్టైపెండ్‌ను 30 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆర్థిక పరిమితులను వివరిస్తూ వార్షిక పెంపు ప్రాతిపదికన సంవత్సరానికి 3 శాతం నుంచి 5 శాతం పెంపును ప్రతిపాదించగా, వైద్య సంఘాలు దానిని తిరస్కరించాయి.

సుమారు 9,000 మంది జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొనడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, మాతాశిశు వైద్యశాలలు, ఐసీయూ, అత్యవసర విభాగాల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సమ్మెలో ఉన్న వైద్య ప్రతినిధులతో పలు విడతల చర్చలు జరిపింది. వైద్యుల అభ్యర్థనలు, ఇతర రాష్ట్రాల్లోని వేతన విధానాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఈ నూతన పెంపును ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ప్రభుత్వం తమ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని స్టైపెండ్ పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు, వైద్య విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆసుపత్రుల్లో సాధారణ సేవలతో పాటు అత్యవసర సేవలు మరింత పటిష్టంగా అందుబాటులోకి రానున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More