ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ అభ్యర్థులకు తీపి కబురు అందించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలను భర్తీ చేసేందుకు పాఠశాల విద్య డైరెక్టరేట్ శ్రీకారం చుట్టింది.

మొత్తంగా 6,534 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ (విద్యా వాలంటీర్) పోస్టుల నియామకం చేపడుతున్నట్లు అధికారుల ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన చేపడుతున్నారు. మొత్తం 6,534 ఖాళీలను రెండు ప్రధాన కేటగిరీలుగా విభజించారు. స్కూల్ అసిస్టెంట్ 2,937, సెకండరీ గ్రేడ్ టీచర్ 3,597 ఖాళీలు ఉన్నాయి.
ఈ నియామకం కేవలం 8 నెలల కాలానికి మాత్రమే పరిమితం. 2026 సెప్టెంబర్ 01 నుండి 2027 ఏప్రిల్ 30 వరకు అభ్యర్థులు విధుల్లో కొనసాగుతారు. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం అభ్యర్థుల అర్హతలు, మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ చేస్తారు. TET (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) లేదా DSC అర్హత పొందిన అభ్యర్థులకు ఈ నియామకాల్లో ప్రాధాన్యత లభిస్తుంది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తమ పరిధిలోని మండల విద్యాధికారి కార్యాలయంలో (MEO) నిర్ణీత గడువులోగా దరఖాస్తు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు చూసుకుంటే.. అకడమిక్ విద్యార్హతల సర్టిఫికెట్లు (పదో తరగతి, ఇంటర్, డిగ్రీ/పిజి), ప్రొఫెషనల్ అర్హత పత్రాలు (D.Ed / B.Ed మార్కుల మేమోలు), AP TET / DSC స్కోర్ కార్డ్ ప్రతులు, స్థానికతను తెలియజేసే కుల, నివాస ధృవీకరణ పత్రాలు కావాలి.
పాఠశాలల్లో బోధన సిబ్బంది కొరతను అధిగమించడం, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ పరీక్షల కోసం నిరీక్షిస్తున్న యువతకు, TET/DSC అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ 8 నెలల అనుభవం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
{{/usCountry}}పాఠశాలల్లో బోధన సిబ్బంది కొరతను అధిగమించడం, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ పరీక్షల కోసం నిరీక్షిస్తున్న యువతకు, TET/DSC అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ 8 నెలల అనుభవం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
{{/usCountry}}అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ వరకు మండల విద్యాధికారి కార్యాలయాన్ని సంప్రదించి అప్లై చేయాలి. ఎంపికైనవారు సెప్టెంబర్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు స్కూళ్లలో విద్యను బోధిస్తారు.