TGPSC : తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. 1,393 పోస్టుల భర్తీకి కసరత్తు!
TGPSC FBO Recruitment 2026 : తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ రానుంది. 1,393 పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు త్వరలో గుడ్‌న్యూస్ రానుంది. అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇంటర్మీడియట్ విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

దరఖాస్తు ప్రక్రియ, పరీక్షా విధానం, శారీరక ప్రమాణాలకు సంబంధించిన సమగ్ర వివరాలు అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.in లో త్వరలోనే అందుబాటులో ఉంచనున్నారు. నోటిఫికేషన్ వచ్చాక దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి. విద్యార్హత ఇంటర్మీడియట్ ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాత పరీక్షలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ఒకే రోజు రెండు పేపర్లు నిర్వహిస్తారు. పురుషులు 4 గంటల సమయంలో 25 కిలోమీటర్ల దూరం నడవాలి. మహిళలు 4 గంటల సమయంలో 16 కిలోమీటర్ల దూరం నడవాలి. టీజీపీఎస్సీ నిర్వహించే ఫిట్‌నెస్ పరీక్షల్లో అర్హత సాధించాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలా అప్లై చేయాలి?
టీజీపీఎస్సీ (TGPSC) అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.in సందర్శించాలి.
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
ఓటీపీఆర్ (OTPR) నమోదు చేసుకోని వారు మొబైల్ నంబర్, ఈమెయిల్‌తో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
వ్యక్తిగత, విద్యా వివరాలను నమోదు చేసి, ఫోటో, సంతకం స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించి, ఫారమ్‌ను సమర్పించాలి.
భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు కాపీని ప్రింట్ తీసి సేవ్ చేసుకోవాలి.
నియామక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష, దాని తర్వాత శారీరక ప్రమాణాల పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష ఉంటాయి. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించే ముందు అర్హత ప్రమాణాలు, ఖాళీల వివరాలు, దరఖాస్తు రుసుము, జీతం, పరీక్షా విధానం, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని తనిఖీ చేసుకోవాలి.
టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజును వెల్లడిస్తుంది. దరఖాస్తు రుసుమును డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ లేదా అందుబాటులో ఉన్న ఇతర చెల్లింపు పద్ధతుల ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. నోటిఫికేషన్ కోసం https://www.tgpsc.gov.in/ వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు చూడండి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


