TGPSC Recruitment : టీజీపీఎస్సీ టౌన్ ప్లానింగ్ నోటిఫికేషన్ అప్డేట్ - ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం, ముఖ్య వివరాలివే
TGPSC Town Planning Recruitment 2026 : తెలంగాణ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో 10 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ ప్రక్రియ ఇవాళ్టి నుంచే ప్రారంభమైంది.
TGPSC Town Planning Recruitment 2026 : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అలర్ట్ ఇచ్చింది. రాష్ట్ర టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా… నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

మొత్తం 10 ఖాళీలు…
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.58,850 నుంచి రూ.1,37,050 వరకు భారీ వేతనాన్ని చెల్లిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా అందుతాయి.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఆర్క్/ బీఈ/బీటెక్ (సివిల్) లేదా బీ.ప్లానింగ్/ బీటెక్ (ప్లానింగ్) లేదా ఎం.ఏ లేదా ఎం.ఎస్సీ(జాగ్రఫీ)/ ఎంఎస్సీ (జియోఇన్ఫర్మేటిక్స్), పీజీడీఎం ఉత్తీర్ణత ఉండాలి. ఓపెన్ యూనివర్సిటీ/దూరవిద్య ద్వారా పొందిన డిగ్రీలు తప్పనిసరిగా యూజీసీ/ ఏఐసీటీఈ/ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ద్వారా గుర్తింపు పొంది ఉండాల్సి ఉంటుంది.
అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. వివిధ కేటగిరీల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయోపరిమితిలో సడలింపులు కల్పించారు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: 5 ఏళ్లు
- దివ్యాంగులకు (PWD): 10 ఏళ్లు
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు: వారి సర్వీస్ కాలపరిమితి ఆధారంగా గరిష్ఠంగా 5 ఏళ్లు
- మాజీ సైనికోద్యోగులు (Ex-Servicemen), ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్లకు: 3 ఏళ్లు
దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1000 కాగా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500 గా నిర్ణయించారు. అన్ని కేటగిరీల అభ్యర్థులు అదనంగా రూ.120 పరీక్షా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అభ్యర్థుల ఎంపిక పూర్తిగా రాత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగానే జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు. ఈ పరీక్షను ఓఎంఆర్ ఆధారిత ఆఫ్‌లైన్ విధానంలో గానీ లేదా కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో గానీ నిర్వహించే అవకాశం ఉంది. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-I మరియు పేపర్-II రెండూ కలిపి ఒక్కొక్కటి 150 మార్కులకు చొప్పున మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- దరఖాస్తుకు చివరి తేదీ: 17 ఆగస్టు 2026
- హాల్ టికెట్ల డౌన్‌లోడ్: పరీక్ష తేదీకి 7 రోజుల ముందు నుంచి అందుబాటులో ఉంటాయి
- రాత పరీక్ష నిర్వహణ: అక్టోబరు 2026 లో పరీక్ష జరిగే అవకాశం ఉంది
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- అర్హత గల అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in/ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ టీజీపీఎస్సీ ఐడీ(ఓటీఆర్), పుట్టిన తేదీ వివరాలు, క్యాప్చాను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే సంబంధిత నోటిఫికేషన్ కు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది.
- వివరాలను ఎంట్రీ చేసిన తర్వాత చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ పూర్తవుతుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

