తెలుగు యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. జులై 16 నుంచి హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జులై 16 నుంచి హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Published on: Jul 10, 2026, 07:15:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని ప్రముఖ విద్యా సంస్థ అయిన సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఉన్నత విద్యా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం వర్సిటీ అధికారులు కీలక ప్రకటన చేశారు.

తెలుగు యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలుగు యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

ప్రవేశ పరీక్షల తేదీ

విశ్వవిద్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రవేశ పరీక్షలన్నీ జులై 23న ఒకే రోజు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని మెయిన్ వర్సిటీ ప్రాంగణంలోనే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. విద్యార్థుల సౌకర్యార్థం వేర్వేరు కోర్సులకు వేర్వేరు సమయాల్లో ప్రవేశ పరీక్షలను షెడ్యూల్ చేశారు.

ఉదయం సెషన్ (11:00 AM నుండి 12:00 PM) బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ - డ్యాన్స్, ఎం.పి.ఏ - ఫోక్ ఆర్ట్స్ కోర్సులకు పరీక్ష జరుగుతుంది.

మధ్యాహ్నం సెషన్ (02:00 PM నుండి) ఎం.ఏ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం కోర్సులో ప్రవేశానికి మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష ప్రారంభం కానుంది.

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ఎప్పటి నుంచి?

ఈ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులు జూలై 16 నుంచి తమ హాల్‌టికెట్లను ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ల కోసం www.pstucet.org అనే వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్‌టికెట్ ప్రింట్ తీసుకోవచ్చు.

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డును తెచ్చుకోవాలి. నిబంధనల ప్రకారం పరీక్ష ప్రారంభ సమయానికి ముందే(నిర్ణీత సమయానికి) అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఆలస్యంగా వస్తే పరీక్షకు అనుమతించేది లేదని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.

లలిత కళలు, జర్నలిజం, జానపద కళల రంగాల్లో కెరీర్ సాధించాలనుకునే విద్యార్థులకు తెలుగు విశ్వవిద్యాలయం అందించే కోర్సులు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ఫాలో అవ్వండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More