రానున్న 2 ఆర్థిక సంవత్సరాల్లో పీపీపీ విధానంలో 10 వైద్య కళాశాలలను నడిపేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. 17 కాలేజీల్లో 11 నాబార్డు కింద, 3 కేంద్రం, 3 సాస్కి కింద మంజూరయ్యాయని తెలిపారు. మొత్తం వ్యయం రూ8480కోట్లు అన్నారు.

'గత ప్రభుత్వ హయాంలో కేవలం 1, 500 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు అందులో పులివెందుల కాలేజీకి మాత్రమే దాదాపు రూ 500 కోట్లు ఖర్చుపెట్టి మిగిలిన కాలేజీల విషయంలో జగన్ వివక్ష ప్రదర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.900 కోట్ల విలువైన పనులు చేసింది. వైసీపీ వారు కాలేజీలు నిర్మించేసామని అసత్య ప్రచారం చేస్తున్నారు. పార్వతిపురంలో వైద్య కళాశాల నిర్మాణానికి కనీసం భూ సేకరణ చేపట్టలేదు.' అని మంత్రి సత్యకుమార్ అన్నారు.
అమరావతి ఔటర్ రింగు రోడ్డు భూసేకరణ
అమరావతి ఔటర్ రింగు రోడ్డు భూసేకరణపై శాసనమండలిలో ఎమ్మెల్సీ డా.మొండితోక అరుణ కుమార్ ప్రశ్నకు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమధానం ఇచ్చారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) నిర్మాణం, యాజమాన్యం, నిర్వహణ కార్యాకలాపాల కోసం ఎన్టీఆర్ జిల్లాలో భూసేకరణ కోసం 05.01.26 న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు.
గెజిట్ ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్ల, వీరులపాడు, గడ్డమానుగు, కొండూరు, మైలవరం మండలాల్లో సుమారు 1416 హెక్టార్ల భూమిని ఈ ప్రాజెక్టు కోసం ప్రతిపాదించారు. భూసేకరణ కచ్చితమైన విస్తీర్ణం తదుపరి 3D ప్రకటన ప్రకారం ఉంటుందన్నారు.
'2013, భూసేకరణ చట్టం ప్రకారం, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ నిర్ణయించిన విధంగా రైతులకు పరిహారం చెల్లించడమవుతుంది. జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణలో తొలుత 3D జరుగుతుంది. ఇంకా 3D పూర్తి కాలేదు. 3D వచ్చిన తర్వాత సభ్యుల సూచనలు పరిగణలోకి తీసుకుంటాం.' అని మంత్రి తెలిపారు.
అసైన్డ్ భూముల చట్ట సవరణకు ఆమోదం
{{/usCountry}}'2013, భూసేకరణ చట్టం ప్రకారం, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ నిర్ణయించిన విధంగా రైతులకు పరిహారం చెల్లించడమవుతుంది. జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణలో తొలుత 3D జరుగుతుంది. ఇంకా 3D పూర్తి కాలేదు. 3D వచ్చిన తర్వాత సభ్యుల సూచనలు పరిగణలోకి తీసుకుంటాం.' అని మంత్రి తెలిపారు.
అసైన్డ్ భూముల చట్ట సవరణకు ఆమోదం
{{/usCountry}}అసైన్డ్ భూముల చట్ట సవరణకు శాసనమండలి ఆమోదం తెలిపింది. చట్ట సవరణతో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు లీజు ద్వారా అసైన్డ్ భూముల కేటాయింపు జరుగుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఎకరాకు ఏడాదికి రూ.31 వేలు, ప్రతి రెండేళ్లకు ఐదు శాతం వరకు పెంపు ఉంటుందన్నారు.
'భూముల లీజు ద్వారా అసైనీ దారులకు నికరమైన ఆదాయం ఉంటుంది. బంజరు భూములు, చౌడ భూములుగా ఉన్న అసైన్డ్ భూములకు ఇక స్థిరమైన ఆదాయం దొరుకుతుంది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు క్లీన్ ఎనర్జీ చాలా కీలకం అవుతుంది. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు కొన్ని చోట్ల అసైన్డ్ భూములు అవసరం అన్నారు. అసైనీదారుల పూర్తి అనుమతితోనే లీజుకు తీసుకుంటాం. ట్రై పార్టీ అగ్రిమెంట్ ద్వారా అసైనీదారులకు పూర్తి స్థాయ రక్షణ ఉంటుంది. ఈ చట్ట సవరణతో రూ.10 లక్షల కోట్ల విలువైన క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవకాశం దొరుకుతుంది. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 7.5 లక్షల మందికి ఉపాధి.' అని మంత్రి అనగాని తెలిపారు.