నకిలీ మద్యంపై ప్రభుత్వం ఫోకస్.. లిక్కర్ దుకాణాల వద్ద కొత్త రూల్స్.. తప్పక చదవాలి!

ఏపీలో నకిలీ మద్యం కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త నిబంధనలను జారీ చేసింది.

Published on: Oct 15, 2025, 17:14:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో నకిలీ మద్యం నివారించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుంది. మద్యం దుకాణాలు, బార్లలో నాణ్యమైన మద్యం అమ్మకాలు జరిగేలా ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఫేక్ లిక్కర్ నివారించేందుకు పలు నిబంధనలను ఎక్సైజ్ శాఖ అమలులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.

మద్యంపై ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
మద్యంపై ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్

ఇక మీదట ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ ద్వారా మద్యం బాటిల్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా స్కాన్ చేయాల్సిందే. క్యూఆర్ కోడ్ స్కానింగ్ తర్వాతే దుకాణం, బార్ల యజమానులు అమ్మాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ప్రతి దుకాణం, బార్ల దగ్గర ప్రత్యేకంగా బోర్డులు ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆ బోర్డులపై ఇక్కడ విక్రయించే మద్యం క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా నిజమైనది, నాణ్యమైనది అని ధృవీకరించాం అని పెట్టాలి.

విక్రయించే ముందు, అమ్ముతున్న ప్రతీ మద్యం బాటిల్ మీద ప్రామాణికతను ధృవీకరించాలని నిబంధలో పేర్కొంది ప్రభుత్వం. మద్యం బాటిల్ మీద సీల్, క్యాప్, హాలోగ్రామ్ స్థితి, ప్రామాణికతను చెక్ చేయాలి. ప్రతీ దుకాణం, బార్లో డైలీ లిక్కర్ జెన్యునైనెస్ వెరిఫికేషన్ రిజిస్టర్ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రిజిస్టర్‌లో అమ్మిన మద్యం బ్రాండ్స్, బ్యాచ్ నంబర్, రిజిస్టర్‌లో నమోదు చేయాలి. అంతేకాదు క్యూఆర్ కోడ్ తనిఖీ చేసిన సమయం, స్టాంప్, స్టేటస్ రిజల్ట్‌ను కూడా ఎంటర్ చేయాలి.

ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డేటా ద్వారా రియల్ టైమ్ డేటాలో ప్రదర్శించాలి. ఎక్సైజ్ సిబ్బంది ప్రతి రోజూ మద్యం దుకాణం, బార్లలో ర్యాండమ్ విధానంలో చెక్ చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలను దుకాణంలోని రిజిస్టర్‌లో నమోదు చేసిన తర్వాత ఎక్సైజ్ అధికారి రోజూ సంతకం చేయాలి. మరో కీలక నిబంధన ఏంటంటే.. డిపో నుంచి వచ్చిన లిక్కర్ స్టాక్ అందిన వెంటనే ప్రతీ షాప్, బార్లో సరకులో నుంచి కనీసం 5 శాతం బాటిళ్లను స్కాన్ చేయాలి.

బ్యాచ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మీద లైసెన్స్ దారు సంతకం చేయాల్సి ఉంటుంది. తనిఖీల్లో నకిలీ మద్యం దొరికితే.. వెంటనే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయాలి. అధికారి, లైసెన్స్ దారుడు నకిలీ మద్యం మీద ఫిర్యాదు చేయకుంటే నకిలీ మద్యానికి సహకరించడం, నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా గుర్తించాలని ప్రభుత్వం తెలిపింది.

నకిలీ మద్యం పట్టుబడితే లైసెన్స్ రద్దు చేయడం, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు.. ఫేక్ లిక్కర్ మీద ప్రజలు ఫిర్యాదు చేయడానికి 24 గంటలు పనిచేసే వ్యవస్థను తీసుకురావాలని తెలిపింది. ఇందుకోసం కంట్రోల్ రూం, వాట్సప్ హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు.. ఫిర్యాదులను 24 గంటల్లోనే విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నిబంధనల్లో పేర్కొంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More