స్కాన్ చేసి నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించొచ్చు.. ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్‌ను ప్రారంభించిన చంద్రబాబు!
నకిలీ మద్యం కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. కల్తీ మద్యంపై విచారణకు జీవీజీ అశోక్‌కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు.
నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించడానికి రూపొందించిన ఏపీ ఎక్సైజ్‌సురక్షా యాప్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో కల్తీ మద్యం వైసీపీ ప్రభుత్వం నుంచి వారసత్వ సంపదగా వచ్చిందని చంద్రబాబు విమర్శించారు. నకిలీ మద్యం కేసులో విస్తూపోయే విషయాలు బయటకు వస్తున్నాయన్నారు. కానీ ఇప్పుడు వాటిపై తాను మాట్లాడదలుచుకోలేదన్నారు.

'కల్తీ మద్యంపై విచారణకు జీవీజీ అశోక్‌కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశాం. నకిలీ మద్యంపై సిట్ బృందంతో మొత్తం ప్రక్షాళన చేస్తాం. సిట్‌లో రాహుల్‌దేవ్ శర్మ, కె.చక్రవర్తి, మలికా గార్గ్ సభ్యులుగా ఉంటారు.' అని చంద్రబాబు అన్నారు.
ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్‌తో నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించవచ్చని సీఎం చంద్రబాబు చెప్పారు. కేవలం స్కాన్ చేస్తే చాలు సీసాకు సంబంధించిన వివరాలు తెలుస్తాయన్నారు. ఎక్కడ అమ్ముతారో అక్కడే జియో ట్యాగింగ్ అవుతుందన్నారు. మరోకచోట అమ్మేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. అలా చేయడం కూడా నేరమేనని సీఎం వెల్లడించారు.
'స్కాన్ చేసిన తర్వాత తయారీ కేంద్రం, తేదీ, బ్యాచ్ అన్నీ వివరాలు తెలుస్తాయి. ప్రస్తుతం ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. వినియోగదారులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూస్తాం. నకిలీ మద్యం కేసుల్లో రాజీ పడేది లేదు. ప్రక్షాళన చేస్తాం. బెల్టు షాపుల్లో అమ్మితే కఠిన చర్యలు ఉంటాయి.' అని చంద్రబాబు పేర్కొన్నారు.
గత పాలకులు గంజాయి, కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కల్తీ మద్యాన్ని చట్టబద్ధం చేసి నేర సామ్రాజ్యాన్ని సృష్టించారన్నారు. కల్తీ మద్యం నివారణకు సిట్, గంజాయి నివారణకు ఈగల్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నేరస్తులు ఎలాంటి వేషంలో వచ్చినా.. కట్టడి చేస్తామన్నారు చంద్రబాబు. ఎవరైనా ఉపేక్షించేది లేదన్నారు. రాజకీయ ముసుగులో తప్పులు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మళ్లీ ఇలాంటి నేరాలు చేయాలని చూస్తే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తామన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


