ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాల్లో భవనాలు నిర్మించే యజమానులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. భవన నిర్మాణాలు పూర్తయిన తర్వాత పొందే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ ప్రక్రియను సులభతరం చేసింది. దరఖాస్తుదారులకు కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పించడమే లక్ష్యంగా ఈ నూతన సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఈ మేరకు పురపాలకశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆటో స్క్రూటినీ…..

ఈ కొత్త విధానం ప్రకారం దరఖాస్తుదారులు భవన నిర్మాణం పూర్తయిన వెంటనే ఏపీడీపీఎంఎస్ ( apdpms.ap.gov.in/ ) పోర్టల్ ద్వారా పూర్తి చేసిన నిర్మాణ ప్లాన్‌ను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు దాఖలైన వెంటనే సిస్టమ్‌లోని ‘ఆటో స్క్రూటినీ ఇంజిన్’ ఆటోమేటిక్ గా ప్లాన్‌ను పరిశీలిస్తుంది. భవనం యొక్క సెట్బ్యాక్లు, ఎత్తు, అంతస్తుల సంఖ్య తదితర వివరాలను మానవ ప్రమేయం లేకుండా వేగంగా లెక్కిస్తుంది.
మంజూరు చేసిన ప్రణాళికకు, క్షేత్రస్థాయిలోని నిర్మాణానికి మధ్య వ్యత్యాసం 10 శాతం లోపు మాత్రమే ఉంటే…. సిస్టమ్ స్వయంగా కాంపౌండింగ్ ఫీజును జనరేట్ చేస్తుంది. నిబంధనల ప్రకారం నిర్మాణం సరిగ్గా ఉంటే…. ఎలాంటి ముందస్తు భౌతిక తనిఖీలు లేదా అధికారుల సైట్ పరిశీలన నివేదికలతో సంబంధం లేకుండా సిస్టమ్ ద్వారా ఆన్లైన్లోనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ అవుతుంది.
ఇప్పటివరకు భవనం పూర్తి చేసిన తర్వాత తనఖా ఆస్తిని విడుదల చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై మార్టిగేజ్ డీడ్ ఉన్న పక్షంలో, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్తో పాటే మార్టిగేజ్ రిలీజ్ లెటర్, రిలింక్విష్మెంట్ డీడ్ కూడా ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతాయి. ఏపీడీపీఎంఎస్ పోర్టల్‌ను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ (IGRS) పోర్టల్‌తో అనుసంధానించారు. దీంతో దరఖాస్తుదారులు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఫిజికల్ గా వెళ్లాల్సిన అవసరం పూర్తిగా తప్పుతుంది.
15 రోజుల్లో తనిఖీలు……
ఆన్లైన్ ద్వారా ఓసీ జారీ చేసిన తర్వాతే పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు భవనాన్ని పరిశీలిస్తారు. ఓసీ జారీ అయిన 15 రోజుల్లోగా అధికారులు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే, ఆ నిర్మాణానికి పూర్తిస్థాయి ఆమోదం లభించినట్లుగానే భావిస్తారు. అయితే…. అనుమతించిన ప్లాన్‌ను కాదని నిబంధనలను తీవ్రంగా అతిక్రమించి నిర్మాణాలు చేపడితే, సంబంధిత లైసెన్స్డ్ టౌన్ ప్లానర్‌తో పాటు దరఖాస్తుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది.
{{/usCountry}}ఆన్లైన్ ద్వారా ఓసీ జారీ చేసిన తర్వాతే పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు భవనాన్ని పరిశీలిస్తారు. ఓసీ జారీ అయిన 15 రోజుల్లోగా అధికారులు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే, ఆ నిర్మాణానికి పూర్తిస్థాయి ఆమోదం లభించినట్లుగానే భావిస్తారు. అయితే…. అనుమతించిన ప్లాన్‌ను కాదని నిబంధనలను తీవ్రంగా అతిక్రమించి నిర్మాణాలు చేపడితే, సంబంధిత లైసెన్స్డ్ టౌన్ ప్లానర్‌తో పాటు దరఖాస్తుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది.
{{/usCountry}}