APCRDA : రూ.661 కోట్లతో అసెంబ్లీ ఐకానిక్ భవనం... ల్యాండ్ పూలింగ్ రైతులకు కనీస కౌలు రూ. 40వేలు

అమరావతి ఐకానిక్ అసెంబ్లీ భవన స్పైర్ నిర్మాణానికి రూ.661 కోట్లతో టెండర్లకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా మలి విడత ల్యాండ్ పూలింగ్ రైతులకు కనీస కౌలు రూ. 40వేలుగా నిర్ణయించింది.

Published on: Sep 20, 2026, 09:51:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి నడిబొడ్డున అత్యంత ఎత్తైన, ఆకర్షణీయమైన భవనాల్లో ఒకటిగా నిలిచే అసెంబ్లీ ఐకానిక్ భవనంపై 250 మీటర్ల ఎత్తున్న 'స్పైర్' నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీని నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పిలిచేందుకు వీలుగా రూ.661 కోట్లకు పరిపాలనాపరమైన ఆమోదం తెలిపినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.

సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు
సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 66వ సీఆర్డీఏ (CRDA) అథారిటీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల వివరాలను మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా ప్రతీ వ్యక్తికి రోజుకు 135 లీటర్ల నీటిని అందించేలా తాగునీటి పైప్‌లైన్ల సామర్థ్యాన్ని పెంచనున్నారు. అలాగే ప్రధాన డ్రైనేజీ వ్యవస్థతో అనుసంధానించే లింక్ డ్రైనేజీ పైపుల ఏర్పాటుతో పాటు 'నెగోషియేటెడ్ సెటిల్‌మెంట్ పాలసీ' (NSP) నిధులు కలుపుకుని మొత్తం రూ.1,548 కోట్లతో టెండర్లు పిలవడానికి అథారిటీ పరిపాలనా అనుమతులు ఇచ్చిందని చెప్పారు.

అమరావతి ప్రాంతంలో ప్రముఖ ప్రైవేటు విద్యాసంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం మార్గం సుగమం చేస్తోంది. ఇందులో భాగంగా నలందా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌కు కృష్ణాయపాలెంలో 5 ఎకరాల భూమిని కేటాయించారు. రాబోయే ఏడాదిన్నర వ్యవధిలో ఈ పాఠశాల నిర్మాణం పూర్తి కానుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా నేలపాడులో హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL) కార్యాలయ నిర్మాణం కోసం 50 సెంట్ల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కౌలు రూ.40 వేలకు పెంపు

రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం కౌలు సొమ్ము అందిస్తోంది. జరీబు భూములకు ఎకరాకు రూ.50 వేలు, నాన్-జరీబు భూములకు రూ.40 వేలు ఇస్తున్నట్లు గుర్తుచేశారు. అయితే 2014-19 మధ్య కాలంలో ఎకరం కంటే తక్కువ భూమి ఇచ్చిన రైతులకు గతంలో రూ.30 వేలు మాత్రమే లభించేది. ప్రస్తుతం రెండో విడత భూసమీకరణ వేళ రైతుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం…. ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న వారికి కూడా కౌలును రూ.40 వేలకు పెంచుతూ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

రాజధాని ప్రాంతంలోని రెవెన్యూ పరమైన సమస్యలు, చిన్నపాటి వివాదాలన్నింటినీ అక్టోబర్ చివరి నాటికి పూర్తిగా పరిష్కరిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్ నాటికి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను 80 శాతం వరకు విజయవంతంగా పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More