రాజధాని అమరావతిని కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం
అమరావతిని కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ 3ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అమరావతి రైతులది త్యాగమే కాదు.. స్ఫూర్తి అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ఆర్థిక పురోగతికి అమరావతి రాజధాని నగర నిర్మాణమే తొలి విజయ సోపానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అంతకుముందు సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జీల ప్రారంభానికి సూచికగా ఉండవల్లి వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. విభజన గాయాల నుంచి కోలుకుని, భూములిచ్చిన రైతుల త్యాగాల పునాదులపై నిర్మితమవుతున్న అమరావతి ఇకపై ఏ శక్తుల వల్లా ఆగదని, ప్రపంచ అత్యుత్తమ నగరాల సరసన నిలుస్తుందని అన్నారు.

సీడ్ యాక్సెస్ రోడ్డుతో రాజధాని నిర్మాణానికి కీలక మలుపు జరుగుతుందన్నారు. మూడో దశలో తాడేపల్లి వద్ద జాతీయ రహదారితో అనుసంధానం అవుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీగా రూపాంతరం అమరావతి చెందనుందన్నారు. 2028 నాటికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రపంచ స్థాయి రాజధానిగా ప్రారంభోత్సవం అవుతుందన్నారు.
భూములిచ్చిన రైతులకు చంద్రబాబు నమస్కరిస్తూ.. రాజధాని పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని వెల్లడించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రగతి కోసం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుజాతి గర్వపడేలా సైబరాబాద్ నగర నిర్మాణం జరిగిందని, విభజన తర్వాత రాజధాని కూడా లేక ఏపీ తీవ్రంగా నష్టపోయిందని సీఎం గుర్తుచేశారు. రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సరిగ్గా మధ్యలో ఉండే గుంటూరు జిల్లా పరిధిలో రాజధాని ఏర్పాటు చేయాలని సంకల్పించామని తెలిపారు.
'సుదీర్ఘ చర్చల తర్వాత ప్రభుత్వంపై నమ్మకంతో పవిత్రమైన రాజధాని నిర్మాణం కోసం తమ అమూల్యమైన భూములను త్యాగం చేసిన రైతులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. సింగపూర్ బృహత్ ప్రణాళిక, లండన్‌కు చెందిన ప్రఖ్యాత నార్మన్ ఫాస్టర్స్ డిజైన్లతో అమరావతి కాంప్లెక్స్ భవనాలను యూనీక్‌గా రూపొందించాం. గతంలో కొందరు వీటిని గ్రాఫిక్స్ అని ఎగతాళి చేశారు. నేడు ఆ గ్రాఫిక్స్ నిజ రూపం దాలుస్తుంటే ఎగతాళి చేసిన వారంతా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.' అని చంద్రబాబు అన్నారు.
అసెంబ్లీ సాక్షిగా రాజధానికి 40 వేల ఎకరాలు కావాలని మద్దతు తెలిపిన వ్యక్తి, అధికారంలోకి వచ్చాక 'మూడు రాజధానులు' అని మాట మార్చడాన్ని ప్రజలు గమనించారని చంద్రబాబు విమర్శించారు. 2019-24 మధ్యకాలంలో రైతులు చేసిన అమరావతి ఉద్యమం చారిత్రాత్మకమైనదని, ఆ పోరాటానికి తాము కూడా జోలె పట్టి సహకరించామని సీఎం గుర్తు చేసుకున్నారు.
అమరావతి కేవలం పరిపాలనా నగరమే కాకుండా, పూర్తిగా కాలుష్య రహిత డీప్ టెక్ క్యాపిటల్‌గా మారబోతోందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్ వ్యాలీగా ప్రపంచంలోనే అగ్రగామి టాప్-5 నగరాల్లో ఒకటిగా అమరావతి రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లు రాజధాని మహానగర పరిధిలోనే భాగమవుతాయన్నారు.
190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు, 96 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు చంద్రబాబు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలంతా చేతిలో జాతీయ జెండా, మనస్సులో నిర్దిష్టమైన అజెండాతో ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి ఇల్లు, వాణిజ్య సముదాయంపైనా త్రివర్ణ పతాకం ఎగరవేయాలన్నారు.
'అమరావతి నిర్మాణంలో సీడ్ యాక్సెస్ రహదారి, స్టీల్ బ్రిడ్జిలు తొలి మెట్టు మాత్రమే. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడే శక్తులతో అప్రమత్తంగా ఉంటూ, హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీని సాధించడమే మన అందరి లక్ష్యం కావాలి.' అని సీఎం చంద్రబాబు అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


