విశాఖలో ఆగస్టు 14న అమరావతి ఛాంపియన్‌షిప్ జిల్లా స్థాయి సెలక్షన్స్

విశాఖపట్నం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 'అమరావతి ఛాంపియన్‌షిప్-2026'కు సంబంధించిన జిల్లా స్థాయి పోటీలు, ఎంపిక ప్రక్రియ ఆగస్టు 14న జరగనుంది. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

Published on: Aug 12, 2026, 14:55:07 IST
By , Visakhapatnam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్‌షిప్-2026 జిల్లా స్థాయి పోటీలు, ఎంపిక ప్రక్రియ ఈ నెల 14న విశాఖపట్నంలో జరగనుంది. కొమ్మాదిలోని శాప్ (SAAP) ఇంటీగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ పోటీలను ఏర్పాటు చేయనున్నట్లు విశాఖ జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఆర్. జూన్ గాలియట్ తెలిపారు.

అమరావతి ఛాంపియన్‌షిప్ జిల్లా స్థాయి సెలక్షన్స్
అమరావతి ఛాంపియన్‌షిప్ జిల్లా స్థాయి సెలక్షన్స్

హాకీ దిగ్గజం, భారతరత్న ద్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 29న దేశవ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ ఛాంపియన్‌షిప్‌ను రూపొందించారు.

ఈ జిల్లా స్థాయి పోటీలకు సంబంధించి ప్రాథమిక ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. గత జూలై 27 నుండి 31 వరకు జిల్లాలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పోటీలు నిర్వహించి క్రీడాకారులను ఎంపిక చేశారు. నియోజకవర్గ స్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచి అర్హత సాధించిన క్రీడాకారులు మాత్రమే ఈ నెల 14న జరిగే జిల్లా స్థాయి పోటీలలో పాల్గొనడానికి అర్హులని అధికారులు స్పష్టం చేశారు.

క్రీడాకారుల ఆసక్తిని, నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకుని మొత్తం 12 రకాల క్రీడా విభాగాలలో ఈ పోటీలు నిర్వహించనున్నారు: ఆర్చరీ (విలువిద్య), అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖో-ఖో, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్, యోగా పోటీలు ఉంటాయి.

ఈ పోటీలను అండర్-17, అండర్-23 కేటగిరీలలో బాలురు, బాలికలకు విడివిడిగా నిర్వహించనున్నారు. ఈ జిల్లా స్థాయి ఎంపికలలో పాల్గొనే అభ్యర్థులు తమ వెంట కొన్ని విధిగా తీసుకరావాల్సి ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు, విద్యార్హత / చదువుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్ (వివరాలు స్పష్టంగా ఉండేలా) తీసుకురావాలి.

వెరిఫికేషన్ నిమిత్తం ఈ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని క్రీడాధికారులు వెల్లడించారు. ఈ జిల్లా స్థాయి పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు తదనంతరం జరగబోయే రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్‌లో విశాఖపట్నం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం పొందుతారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కోరింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More