Andhrapradesh : భవన యజమానులకు గుడ్‌న్యూస్ - ఇక ఆన్‌లైన్‌లోనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్! ప్రాసెస్ ఇలా….

ఏపీలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, మార్టిగేజ్ విడుదల ప్రక్రియను మున్సిపల్ శాఖ మరింత సులభతరం చేసింది. ఏపీడీపీఎంఎస్ పోర్టల్ ద్వారా ఎలాంటి ముందస్తు వెరిఫికేషన్ లేకుండా ఆన్‌లైన్‌లోనే ఓసీ పొందే వెసులుబాటు కల్పించింది.

Published on: Oct 17, 2026, 17:36:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాల్లో భవనాలు నిర్మించే యజమానులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. భవన నిర్మాణాలు పూర్తయిన తర్వాత పొందే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ ప్రక్రియను సులభతరం చేసింది. దరఖాస్తుదారులకు కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పించడమే లక్ష్యంగా ఈ నూతన సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఈ మేరకు పురపాలకశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇక ఆన్‌లైన్‌లోనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్! (image source Pixel)
ఇక ఆన్‌లైన్‌లోనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్! (image source Pixel)

ఆటో స్క్రూటినీ…..

ఈ కొత్త విధానం ప్రకారం దరఖాస్తుదారులు భవన నిర్మాణం పూర్తయిన వెంటనే ఏపీడీపీఎంఎస్ ( apdpms.ap.gov.in/ ) పోర్టల్ ద్వారా పూర్తి చేసిన నిర్మాణ ప్లాన్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు దాఖలైన వెంటనే సిస్టమ్‌లోని ‘ఆటో స్క్రూటినీ ఇంజిన్’ ఆటోమేటిక్ గా ప్లాన్‌ను పరిశీలిస్తుంది. భవనం యొక్క సెట్‌బ్యాక్‌లు, ఎత్తు, అంతస్తుల సంఖ్య తదితర వివరాలను మానవ ప్రమేయం లేకుండా వేగంగా లెక్కిస్తుంది.

మంజూరు చేసిన ప్రణాళికకు, క్షేత్రస్థాయిలోని నిర్మాణానికి మధ్య వ్యత్యాసం 10 శాతం లోపు మాత్రమే ఉంటే…. సిస్టమ్ స్వయంగా కాంపౌండింగ్ ఫీజును జనరేట్ చేస్తుంది. నిబంధనల ప్రకారం నిర్మాణం సరిగ్గా ఉంటే…. ఎలాంటి ముందస్తు భౌతిక తనిఖీలు లేదా అధికారుల సైట్ పరిశీలన నివేదికలతో సంబంధం లేకుండా సిస్టమ్ ద్వారా ఆన్‌లైన్‌లోనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ అవుతుంది.

ఇప్పటివరకు భవనం పూర్తి చేసిన తర్వాత తనఖా ఆస్తిని విడుదల చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై మార్టిగేజ్ డీడ్ ఉన్న పక్షంలో, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌తో పాటే మార్టిగేజ్ రిలీజ్ లెటర్, రిలింక్విష్‌మెంట్ డీడ్ కూడా ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతాయి. ఏపీడీపీఎంఎస్ పోర్టల్‌ను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ (IGRS) పోర్టల్‌తో అనుసంధానించారు. దీంతో దరఖాస్తుదారులు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఫిజికల్ గా వెళ్లాల్సిన అవసరం పూర్తిగా తప్పుతుంది.

15 రోజుల్లో తనిఖీలు……

ఆన్‌లైన్ ద్వారా ఓసీ జారీ చేసిన తర్వాతే పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు భవనాన్ని పరిశీలిస్తారు. ఓసీ జారీ అయిన 15 రోజుల్లోగా అధికారులు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే, ఆ నిర్మాణానికి పూర్తిస్థాయి ఆమోదం లభించినట్లుగానే భావిస్తారు. అయితే…. అనుమతించిన ప్లాన్‌ను కాదని నిబంధనలను తీవ్రంగా అతిక్రమించి నిర్మాణాలు చేపడితే, సంబంధిత లైసెన్స్‌డ్ టౌన్ ప్లానర్‌తో పాటు దరఖాస్తుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More