...
...
Next Story

ఉగాదిలోపు 5 లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం.. ప్రతీ మూడు నెలలకోసారి గృహప్రవేశం : మంత్రి పార్థసారథి

మరో ఐదు లక్షల ఇళ్లను ఉగాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Published on: Nov 25, 2025, 14:02:37 IST
Advertisement

సీఎం, మంత్రులు కష్టపడి పని చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుందన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుందని చెప్పారు. టెక్నాలజీ సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటున్నామని మంత్రి వెల్లడించారు.

మంత్రి పార్థసారథి(ఫైల్ ఫొటో)
మంత్రి పార్థసారథి(ఫైల్ ఫొటో)

'గృహనిర్మాణ శాఖ విషయంలో మూడు లక్షల ఇళ్లు పూర్తి చేసిన సందర్భంగా కీ హ్యాండోవర్ కార్యక్రమం నిర్వహించాం. ఆ కార్యక్రమాన్ని కూడా వైసీపీ వివాదం చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 8 లక్షల 627 ఇళ్లు పూర్తయ్యాయి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 6 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తి అయ్యాయి.' అని మంత్రి పార్థసారథి తెలిపారు.

16 నెలల్లో మూడు లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేశామని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. మరో అయిదు లక్షల ఇళ్లను ఉగాదిలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఇప్పటిదాకా ప్రారంభం కాని ఇళ్లు మూడు లక్షల 30 వేల ఉన్నాయన్నారు. మెుత్తం 15.59 లక్షల ఇళ్లు ఈ అయిదు సంవత్సరాలలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

'హౌసింగ్ ఫర్ ఆల్ అని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి గృహప్రవేశం చేయిస్తాం. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించేందుకు కామన్ వాల్‌తో కలిపి కట్టుకునేందుకు జీవో ఇస్తాం.'అని మంత్రి తెలిపారు.

మరోవైపు గత ప్రభుత్వంపై మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. 18 లక్షల ఇళ్లకు గానూ 30 శాతం మాత్రమే పూర్తి చేశారన్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వం నిర్మించే ఇళ్ల స్కీమ్‌లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కాంట్రాక్ట్ తీసుకున్న రాక్రీట్ నిర్మాణ సంస్థ అన్యాయం చేసిందన్నారు 47 వేల 850 ఇళ్లు తీసుకుని.. నిర్మిస్తామని చెప్పి ఎక్కడా పూర్తి చేయలేదని చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks