APPSC Group 2 : ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిక్రూట్మెంట్.. 720 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం
APPSC Group 2 Jobs : ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సర్వీసెస్ కింద వివిధ ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం పూర్తిస్తాయి నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి నవంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ (APPSC) బిగ్ న్యూస్ అందించింది. వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీ గ్రూప్ 2 అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 720 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నేటి(నవంబర్ 10) నుంచి నవంబరు 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 2026 వరకు అవకాశం కల్పించారు. పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఫిబ్రవరి 21, 2027న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న 720 పోస్టుల్లో ప్రధానమైన డిప్యూటీ తహశీల్దార్, డిప్యూటీ ఎంపీడీవో, ఏఎస్ఓ వంటి కీలక ఉద్యోగాలు ఉన్నాయి.
డిప్యూటీ తహశీల్దార్ 203
డిప్యూటీ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ (MPDO) 176
సీనియర్ అకౌంటెంట్ (హెచ్ఓడీలు/జిల్లాలు) 91
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (GAD, ఫైనాన్స్, లా) 80
జూనియర్ అకౌంటెంట్ (ట్రెజరీస్ & అకౌంట్స్) 47
గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్ (GSTO) 40
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 31
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్-ఇన్స్పెక్టర్ 29
కోఆపరేటివ్ సొసైటీల అసిస్టెంట్ రిజిస్ట్రార్ 10
సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్-2 07
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3 06
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఏఎస్ఓ (లా డిపార్ట్మెంట్)కు న్యాయ శాస్త్రంలో డిగ్రీ (LL.B) పూర్తి చేసి ఉండాలి. ఏఎస్ఓ (ఫైనాన్స్), సీనియర్/జూనియర్ అకౌంటెంట్‌కు గణితం, అర్థశాస్త్రం లేదా కామర్స్ విభాగంలో డిగ్రీ ఉండాలి. అకౌంటింగ్ పోస్టులకు కంప్యూటర్ సైన్స్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ తప్పనిసరి. ఎక్సైజ్ ఎస్ఐ/సబ్ రిజిస్ట్రార్‌కు నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి (01/07/2026 నాటికి) పోస్ట్ కోడ్‌ను బట్టి కనీస వయస్సు 18 లేదా 21 సంవత్సరాలు ఉండాలి. గరిష్ఠ వయస్సు 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ ఖాళీలకు దరఖాస్తు చేసే దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది.
ఏపీ గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వ నూతన పీఆర్సీ ప్రకారం ఆకర్షణీయమైన వేతనం అందుతుంది. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3, జీఎస్టీఓ, కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్, డిప్యూటీ ఎంపీడీఓ: రూ. 45,830 – 1,30,580 వేతనం ఉంటుంది. డిప్యూటీ తహశీల్దార్, సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్-II: రూ. 44,570 – 1,27,480, సీనియర్ అకౌంటెంట్: రూ. 34,580 – 1,07,210, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: రూ. 25,220 – 80,910, ఇతర ఎగ్జిక్యూటివ్/నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు: రూ. 40,970 – 1,24,380 జీతం వస్తుంది.
ఈ ఉద్యోగాల ఎంపిక మూడు దశలలో సాగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్కులకు ఆఫ్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి 300 మార్కులకు మెయిన్స్ పరీక్ష ఉంటుంది. కొన్ని నిర్దేశిత సాంకేతిక, అకౌంట్ పోస్టులకు కంప్యూటర్ నైపుణ్య పరీక్ష నిర్వహించి ఆ తర్వాత తుది ఎంపిక జాబితా విడుదల చేస్తారు. ప్రతీ తప్పు సమాధానానికి నిర్దేశించిన మార్కుల నుంచి 1/3వ వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ. 250, పరీక్ష ఫీజు రూ. 80. మొత్తం రూ. 330 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, ఏపీ సివిల్ సప్లైస్ వైట్ రేషన్ కార్డ్ కలిగిన కుటుంబాల అభ్యర్థులకు పరీక్ష ఫీజు (రూ. 80) నుంచి మినహాయింపు ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 26 జిల్లా కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ప్రాధాన్యత ప్రకారం 3 జిల్లా కేంద్రాలను ఎంచుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు నవంబర్ 10న ప్రారంభమయ్యాయి. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 30గా నిర్ణయించారు.
అధికారిక వెబ్సైట్ psc.ap.gov.inలో అప్లై చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెబ్సైట్లో ఓటీపీఆర్(OTPR) రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


