ఏపీలోని నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త వచ్చేసింది. హైకోర్టులోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

నోటిఫికేషన్ లోని వివరాల ప్రకారం…. అసిస్టెంట్స్, ఎంట్రీ ఆపరేటర్స్,ఆఫీస్ సబార్డినెట్, టైపిస్ట్, ఎగ్జామినర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ అండ్ ఆఫీస్ సబార్డినెట్ పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో అత్యధికంగా అసిస్టెంట్ ఖాళీలు 78 ఉన్నాయి.
ఈనెల 30 నుంచి దరఖాస్తులు…
ఈ పోస్టులకు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ… మార్చి 30వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 19వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. https://aphc.gov.in/index.php వెబ్ సైట్ ద్వారా ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
పోస్టులను అనుసరించి విద్యా అర్హతలను నిర్ణయించారు. కొన్ని పోస్టులను 7వ తరగతి ఉత్తీర్ణతతోనే భర్తీ చేస్తారు. మరికొన్ని పోస్టులకు డిగ్రీ లేదా ఇంజినీరింగ్, లా డిగ్రీ వంటి అర్హతలు ఉండాలి. టైపింగ్ పోస్టులకు మాత్రం స్కిల్ టెస్ట్ ఉంటుంది. అంతేకాకుండా… షార్ట్‌హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు ఉండాలి.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)లు నిర్వహిస్తారు. కొన్ని పోస్టులకు మాత్రం స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. జనరల్ నాల్డెజ్, మెంటల్ ఎబిలిటీ వంటి వాటి నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 80 మార్కులకు ఎగ్జామ్ ఉండగా.. 90 నిమిషాల సమయం కేటాయిస్తారు.
గరిష్ఠ వయోపరిమితి చూస్తే…. 01-01-2026 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడౠ్ల్యఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ. 800, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు అయితే రూ. 400 చెల్లించాలి.
హైకోర్టు ఉద్యోగ నోటిఫికేషన్ - పోస్టుల వివరాలు :
1. సెక్షన్ ఆఫీసర్ - 5
{{/usCountry}}1. సెక్షన్ ఆఫీసర్ - 5
{{/usCountry}}2. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ - 1
3. కంప్యూటర్ ఆపరేటర్ - 31
4. అసిస్టెంట్ లైబ్రేరియన్ - 1
5. లైబ్రేరియన్ గ్రేడ్-II -1
6. UD స్టెనోగ్రాఫర్ -7
7. అసిస్టెంట్ - 78
8. ఎగ్జామినర్ - 27
9. టైపిస్ట్ - 44
10. కాపీయిస్ట్ - 34
11. డేటా ఎంట్రీ ఆపరేటర్ - 50
12. స్టెనోగ్రాఫర్ - 1
13. ఆఫీస్ సబార్డినేట్ - 20